కాంగ్రెస్ లో షర్మిల ” విలీనం ” కన్ఫర్మ్ ?

61
- Advertisement -

గత కొన్నాళ్లుగా వైఎస్ షర్మిల తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయబోతుందని, కాంగ్రెస్ కూడా షర్మిలకు కీలక బాధ్యతలు అప్పగించేందుకు సిద్దమైందని.. ఇలా రకరకాల వార్తలు వస్తూనే ఉన్నాయి. ఆ మధ్య కర్నాటక ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు తరువాత ఆ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ తో వైఎస్ షర్మిల పలు మార్లు భేటీ కావడం, టి కాంగ్రెస్ నేతలు కూడా షర్మిల కాంగ్రెస్ లో చేరితే ఆహ్వానిస్తామంటూ చెప్పడం.. వంటి పరిణామాలతో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని షర్మిల కాంగ్రెస్ లో విలీనం చేసేందుకు సిద్దమైందా అనే అనుమానాలు తెరపైకి వచ్చాయి. అయితే ఆ తరువాత తాను ఏ పార్టీతో పొత్తు పెట్టుకునేది లేదని, విలీనం చేయాల్సిన అవసరం లేదని షర్మిల క్లారిటీ ఇవ్వడంతో ఇలాంటి రూమర్స్ కొద్దివరకు సద్దుమణిగాయి. అయితే నిప్పు లేనిదే పొగ రాదు అన్నట్లుగా లోలోపల విలీనం కు సంబంధించిన కసరత్తులు చేస్తూ పైపైకి షర్మిల అలా మాట్లాడుతున్నారా అనే అనుమానాలు కూడా తెరపైకి వస్తున్నాయి.

Also Read: బి‌ఆర్‌ఎస్.. సింగిల్ గానే బరిలోకి ?

ఎందుకంటే తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో బి‌ఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ.. ఈ మూడు పార్టీల మధ్యనే ప్రధాన పోరు ఉండే అవకాశం ఉంది. షర్మిల ఎన్ని ప్రయత్నాలు చేసిన కొంతమేర ఓటు బ్యాంకుపై ప్రభావం చూపే అవకాశం ఉన్నా.. అధికారం చేపట్టేంతా లేదనేది అందరికీ తెలిసిన విషయం. అందుకే ఒంటరిగా పోటీ చేయడం కన్నా.. పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తే తాను రాజకీయాల్లో బలపడడం మేలనే ఆలోచనలో షర్మిల ఉన్నారట. ఈ విషయమై ఇప్పటికే పలువురు కాంగ్రెస్ నేతలు ఆమెతో మంతనాలు కూడా చేస్తున్నట్లు సమాచారం. కేవీపీ రామచంద్ర రావు మధ్య వర్తిత్వం ద్వారా ఇప్పటికే ఆమె కాంగ్రెస్ లో చేరేందుకు సిద్దమయ్యారనే వార్తలు వినిపిస్తున్నాయి. అన్నీ అనుకున్నట్లు జరిగితే కాంగ్రెస్ పార్టీ తరుపున ఆమె పాలేరు నియోజిక వర్గం నుంచి పోటీ చేసే అవకాశం ఉందట. మరి షర్మిల నిజంగానే తన తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తుందా అనేది తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.

Also Read: కే‌సి‌ఆర్ పథకాలే దిక్కు అంటున్న బీజేపీ !

- Advertisement -