తెలంగాణ సీఎం కేసీఆర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండో విడుత కంటి వెలుగు కార్యక్రమం నేటికి వంద రోజులు పూర్తి చేసుకుంది. ఈమేరకు తెలంగాణ సచివాలయంలో మంత్రులు సంబురాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రులందరూ కేక్ కట్ చేసి వైద్యారోగ్య సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్యారోగ్య శాఖ సెక్రెటరీ రిజ్వి, హెల్త్ కమిషనర్ శ్వేత మహంతి, డీహెచ్ శ్రీనివాసరావు, టివివిపి కమిషనర్ అజయ్ కుమార్, టిఎస్ఎంఎస్ ఐడిసి ఎండీ చంద్రశేఖర్ రెడ్డి, కంటి వెలుగు ప్రోగ్రాం ఆఫీసర్ స్వరాజ్య లక్ష్మి, ఆరోగ్య శాఖ అధికారులు, ఆశా ఏఎన్ఎంలు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో హరీశ్‌రావు, ప్రశాంత్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, జగదీశ్‌రెడ్డి, గంగుల కమలాకర్, టీఎస్‌ఎంఎస్ఐడీసీ చైర్మన ఎర్రోళ్ల శ్రీనివాస్ పాల్గొన్నారు. వందరోజులు పూర్తి చేసుకొని లక్ష్యానికి మించి కంటి పరీక్షలు చేయడం జరిగిందని మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఎవరూ అడగక ముందే ఈ పథకం ప్రారంభించి మానవత్వాన్ని చాటుకున్న గొప్ప మనసు సీఎం కేసీఆర్ అని అన్నారు. గ్రామాలకు వైద్య సిబ్బంది వచ్చి ఉచితంగా పరీక్షలు నిర్వహించి అద్దాలు అందించే కార్యక్రమం ప్రపంచంలో తెలంగాణలో మినహా మరెక్కడా లేదని అన్నారు.
Also Read: CMKCR:దేశద్రోహం కేసులు ఎత్తివేయండి.. డీజీపీకి ఆదేశాలు
రాష్ట్రవ్యాప్తంగా కోటి 61లక్షల మందికి కంటి పరీక్షలు నిర్వహించినట్టు మంత్రి తెలిపారు. దృష్టి లోపం ఉన్న 40.59లక్షల మందికి అనగా 25.1శాతం మందికి గ్లాసెస్ పంపిణీ చేయడం జరిగింది. ఇందులో 22.51 లక్షల మందికి ఉచితంగా కళ్లద్దాలు, మెడిసిన్స్ అందించారు. 18.08 లక్షల ప్రిస్కిప్షన్ గ్లాసెస్ కూడా ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది. మొత్తంగా ఇప్పటికే 24 జిల్లాల్లో కంటి వెలుగు కార్యక్రమం పూర్తయింది. మిగిలిన 9 జిల్లాలో కూడా ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తూ కంటి వెలుగు పరీక్షలు పూర్తి చేయాలని మంత్రి సూచించారు.
Also Read: KTR:వరంగల్‌కు పూర్వవైభవం తెస్తాం