దుండిగల్ ఎయిర్‌ఫోర్స్ అకాడమీలో కంబైన్డ్ గ్రాడ్యూయేషన్ పరేడ్ గౌరవ వందనంను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్వీకరించారు. రాష్ట్రపతి ముర్ము…పరేడ్‌కు రివ్యూయింగ్ అధికారిగా రావడం ఇదే తొలిసారి కావడం విశేషం. క్యాడేట్ల పరేడ్ విన్యాసాలను ఆహుతులను అలరిస్తున్నాయి. అకాడమీ నుంచి 119మంది ఫ్లయింగ్ ఎయిర్ ట్రైనీలుగా, 75మంది గ్రౌండ్ డ్యూటీ ట్రైనీ క్యాడెట్లు, మరో 8మంది క్యాడెట్లు ప్రత్యేక శిక్షణ పూర్తి చేసుకున్నారు. వీరిలో ఇద్దరు వియత్నాం దేశానికి చెందిన వారుకాగా మిగిలిన ఆరుగురు నేవీ కోస్ట్‌గార్డ్‌కు చెందినవారు ఉన్నారు.
Also Read: రుతుపవనాలు ఆలస్యమైన..వర్షాలు అధికమే:శ్రావణి
ఈ కార్యక్రమానికి గవర్నర్ తమిళసై, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్రమంత్రి సత్యవతి రాథోడ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, డీజీపీ అంజనీకుమార్ యాదవ్, మేడ్చల్ కలెక్టర్ అమోయ్ కుమార్ పాల్గొన్నారు.
Also Read: తృణధాన్యాలు…మోదీ ఫాల్గుణి షా పాట