కోదండరాంను తరిమిన రైతులు..

292
Formers fire on Kodandaram
- Advertisement -

తెలంగాణ జేఏసీ ఛైర్మన్ కోదండరాంకు చేదు అనుభవం ఎదురైంది. తిరుమలగిరి, సూర్యాపేట మార్కెట్ యార్డులను సందర్శించేందుకు వచ్చిన  కోదండరాంను రైతులు అడ్డుకున్నారు. రైతుల నిరసనతో కోదండరాం కంగుతిన్నారు. మార్కెట్‌యార్డుల వద్దకు వెళ్లిన కోదండరాం పట్ల రైతులు తీవ్ర ఆగ్రహం వెలిబుచ్చారు. కోదండరాం గో బ్యాక్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.  మీడియాతో కూడా మాట్లాడనివ్వలేదు రైతులు.దీంతో కోదండరాం అక్కడి నుంచి వెళ్లిపోయారు.

మ‌రోవైపు రాష్ట్రంలో మిర్చిరైతుల ఆందోళ‌న‌పై స్పందించిన టీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌ర్నె ప్ర‌భాక‌ర్ మిర్చి ధ‌ర‌ను ప్ర‌భుత్వం నిర్ణ‌యించ‌ద‌ని అన్నారు. రైతులు ఆందోళ‌న చెంద‌వ‌ద్ద‌ని స‌ర్కారు రైతుల ప‌క్షానే ఉంద‌ని అన్నారు.   ఖమ్మం మార్కెట్ యార్డుపై ఎమ్మెల్యే సండ్ర అనుచరులు దాడిచేశారని ఆరోపించారు. ఇది రైతులపై దాడిగానే భావిస్తున్నామని ఆ పార్టీనేత గట్టు రాంచంద్రరావు తెలిపారు. రైతులను టీడీపీ నేతలు రోడ్డుపాలు చేశారని మండిపడ్డారు. రైతులను ఎమ్మెల్యే రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు.

- Advertisement -