అనాథలకు బాహుబలి 2 చూపించిన సమంత!

173
Samantha Birthday special
- Advertisement -

ముసిముసినవ్వుల ముద్దుగుమ్మ  సమంత సినిమాలలో ఏ రేంజ్‌ లో హీరోయిన్‌ గా ఆకట్టుకుందో అదే విధంగా తనకు ఉన్నదానిలో అనాధలకు సాయం చేయడంలోనూ ముందంజలో ఉంటుంది. సినిమా హీరోయిన్ గానే కాదు.. సమంత మంచి మనసున్న మనిషి అని అభిమానులు సగర్వంగా చెప్పుకొంటారు. ఓ వైపు సినిమాలతో బిజీగా ఉంటునే మరోవైపు  ప్రత్యూష ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తోంది.

ఇక తన పుట్టిన రోజు సందర్భంగా క్యూట్ గర్ల్ ప‌లువురు అనాథ పిల్ల‌లకు హైద‌రాబాద్‌లోని ఓ థియేట‌ర్‌లో బాహుబ‌లి-2 సినిమా చూపించింది. ఈ సంద‌ర్భంగా స‌మంత మీడియాతో మాట్లాడుతూ ప్ర‌త్యూష ఆర్గ‌నైజేష‌న్ పిల్ల‌లు త‌న‌తో క‌లిసి బాహుబలి 2 సినిమా చూడ‌డం ఎంతో సంతోషంగా ఉంద‌ని పేర్కొంది. బాహుబలి చూడాలని పిల్లలు ఎంతో ఆత్రుత‌గా ఉంటార‌ని సమంత తెలిపింది.

చిన్నారుల ముఖంలో చిరునవ్వు చూస్తే త‌న‌కు ఆనందంగా ఉంటుందని, చిన్న సాయం చేసినా పిల్ల‌లు దాన్ని జీవితాంతం గుర్తుంచుకుంటారని తెలిపింది. బాహుబ‌లి సినిమాను రాజమౌళి చాలా బాగా తీశారని, ఆయన ఎంతో గొప్ప ద‌ర్శ‌కుడ‌ని ఆమె ప్ర‌శంసలు కురిపించింది. చిన్నారులంతా థియేటర్లోనే హ్యాపీ బర్త్ డే సాంగ్ ఆలపించి సమంతకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. బాహుబలి సినిమా చూసినందుకు వారు ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేశారు.

ఇదిఇలా ఉండగా సమంతా తెలంగాణ చేనేతకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న సంగతి తెలిసిందే. 2012లో ప్రత్యూష ట్రస్ట్‌ను స్ధాపించిన సమంత పలు సేవా కార్యక్రమాలతో అందరి మన్ననలను పొందుతోంది.

- Advertisement -