- Advertisement -
ఈనెల 18 నుంచి జరిగే బోనాల జాతరకు తెలంగాణ ప్రభుత్వం భారీగా ఏర్పాట్లు చేస్తోంది. ఈమేరకు ఈ నెల 19, 20తేదీలలో నిర్వహించే బల్కంపేట్ ఎల్లమ్మ అమ్మవారి కళ్యాణోత్సవాలకు గ్రేటర్ జోన్ ఆర్టీసీ అధికారులు ప్రత్యేకంగా బస్సులను నడుపనుంది. నగరంలోని పలు ప్రాంతాల నుంచి బల్కంపేట్‌కు ఆర్టీసీ బస్సులు అందుబాటులో ఉంటాయన్నారు. దీనికి సంబంధించిన పోస్టర్‌ను బుధవారం ఆర్టీసీ గ్రేటర్ జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వీ. వెంకటేశ్వర్లు విడుదల చేశారు. ప్రత్యేక బస్సులకు సంబంధించిన పూర్తి వివరాల కోసం 9959226148 ఫోన్ నంబర్‌లో సంప్రదించాలన్నారు. దీంతో పాటుగా నగరంలో రేతిఫైల్ బస్టాండ్, కోఠి బస్టాండ్ ఫోన్ నెంబర్లను కూడా అందుబాటులో ఉంచారు. అవి…9959226154, కోఠి బస్టాండ్ 9959226160.
Also Read: TELANGANA:కళాఖండాలకు అంతార్జాతీయ గౌరవం
- Advertisement -