దేశంలో అగ్నిప్రమాదాలు తుఫాన్లు వరదలు వంటి అనుకోని సంఘటనలు ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ప్రాణ నష్టం జరగకుండా నివారించేందుకు కేంద్రం కొత్తగా మూడు పథకాలను తీసుకువస్తున్నట్టు కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటించారు. దీనిలో భాగంగా అగ్నిమాపక దళాల శకటాల ఆధునికీకరణ వరదలు కొండ చరియలు విరిగిపడటం వంటి ఘటనలను నివారించడం వంటివి ఇందులో పేర్కొన్నారు. ఇందుకోసం రూ.8వేల కోట్లు కేటాయిస్తున్నట్టు అమిత్ షా తెలిపారు. ఈ మేరకు రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాల మంత్రులతో ఆయన సమావేశమయ్యారు.
అగ్నిమాపక శకటాల ఆధునికీకరణ కోసం రూ.5వేల కోట్లు కేటాయిస్తున్నట్టు ప్రకటించారు. అన్ని రాష్ట్రాలకు ఈ మొత్తం అందిస్తామని వెల్లడించారు. సమగ్ర ప్రణాళికను రూపొందించి రాష్ట్రాలకు పంపుతామని తెలిపారు. దేశంలోని ప్రధాన నగరాలైన ముంబయి, చెన్నై, కోల్‌కతా, బెంగళూరు, అహ్మదాబాద్, హైదరాబాద్, పుణె వంటి నగరాల్లో వరద నివారణకు రూ.2500కోట్లు కేటాయిస్తున్నట్టు తెలిపారు. దీనికి సంబంధించిన వివరాలు కూడా త్వరలో వెల్లడిస్తామని ప్రకటించారు.
Also Read: జగన్ తో బీజేపీ అందుకే విభేదిస్తుందా ?
అలాగే దేశంలోని 17రాష్ట్రాల్లో కొండ చరియలు విరిగిపడే ఘటనలను ఎదుర్కొనేందుకు గానూ రూ.825కోట్లు కేటాయిస్తున్నట్టు తెలిపారు. ఎలాంటి ప్రకృతి విపత్తు సంభవించినా ప్రాణ నష్టం సంభవించకుండా చూడాలని పేర్కొన్నారు. ప్రధాని మోదీ హయాంలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు కరోనాను సమర్థవంతంగా ఎదుర్కొన్న విషయాన్ని ఈ సమావేశం సందర్భంగా గుర్తు చేశారు.
Also Read: పవన్ ఫోకస్ తెలంగాణపై మళ్లిందా ?