ఆడబిడ్డలకు అన్నలా…మేనమామలా…తమ్ముడిలా…తల్లికి పెద్ద కొడుకులా…కంటికి రెప్పలా కాపాడుతున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నేడు మహిళ సంక్షేమ దినోత్సవం సందర్భంగా మహిళాలోకానికి కవిత శుభాకాంక్షలు తెలిపారు. ఆడబిడ్డల రక్షణ కోసం దేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా అనేక సంక్షేమ పథకాలను సీఎం కేసీఆర్ అమలు చేస్తున్నారు. దేశానికి స్పూర్తిగా నిలిచారని ఎమ్మెల్సీ కవిత అన్నారు.
కళ్యాణలక్ష్మితో ఇంటికి మేనమామలా…నూట్రిషన్ కిట్, కేసీఆర్ కిట్‌తో ఫ్యామిలీ డాక్టర్లా… అమ్మ ఒడితో సంరక్షకుడిలా..ఆరోగ్య లక్ష్మితో అరోగ్య దాతగా…షీటీంలతో రక్షకుడిగా సీఎం కేసీఆర్ అండగా నిలుస్తున్నారని కవిత అన్నారు. బీడీ కార్మికులకు పెన్షన్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని కొనియాడారు. ఒంటరి మహిళలకు భరోసానిస్తూ, మహిళలకు చేదోడుగా ఉంటున్నారని అన్నారు. బిందెలతో నీటి కోసం కిలోమీటర్ల దూరం నడవకుండా ఇంటికే సురక్షిత నీరు అందించాలన్న ఉద్దేశంతో మిషన్ భగీరథ కార్యక్రమాన్ని తీసుకోచ్చారని తెలిపారు. గతరాష్ట్ర ప్రభుత్వాలు చేయని పనిని చేసిన సీఎంగా నిలిచారు. అంగన్ వాడి ఆశా కార్యకర్తలకు జీతాలు పెంచిన ఆపద్బాంధవుడని తెలిపారు.
గడిచిన తొమ్మిది సంవత్సరాలలో 13,90,636మంది బాలింతలు కేసీఆర్ కిట్ ద్వారా లబ్దిపొందారని అన్నారు. 6.84లక్షల మంది గర్బిణీలకు కేసీఆర్ న్యూట్రిషన్ కిట్లు, 18,46,635మంది మహిళలకు అమ్మ ఒడి పథకం అందించిరాని తెలిపారు. ఒంటరి మహిళలకు రూ. 1545.8కోట్ల మేర పెన్షన్ అందిస్తున్నారని అన్నారు. 15,85,088మంది వితంతవులకు నెలకు రూ.2016చొప్పున ఈ ఏడాది ఇప్పటివరకూ రూ. 20,556.11కోట్ల మేర పేన్షన్ అందిస్తున్న ఏకైక రాష్ట్రమని కవిత అన్నారు.
Also Read: పత్తి విత్తనాలు అధిక ధరలకు అమ్మితే కఠినచర్యలు..
స్వతంత్ర భారతదేశంలో ఎన్నడూ లేనంతగా మహిళ సంక్షేమంలో బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో తెలంగాణ రాష్ట్రం సరికొత్త రికార్డు సృష్టించిందని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. సీఎం కేసీఆర్ పాలనలో తెలంగాణ స్త్రీ జాతి సగర్వంగా సంతోషంగా జీవిస్తున్నారని తెలిపారు. ఒక మహిళగా నాకు ఎంతో గర్వకారణంగా ఉందని తెలిపారు.
Also Read: KTR:మహిళా సంక్షేమంలో దేశానికే ఆదర్శం