CMKCR:కులవృత్తి దారులకు ఆర్థిక సాయం…

43
- Advertisement -

మంచిర్యాలలో నూతన కలెక్టరేట్‌ ప్రారంభోత్సవం సందర్భంగా పలు సంక్షేమ పథకాలను ప్రారంభించారు. బీసీ కులాల్లోని కుల వృత్తుల లబ్దిదారులకు కేసీఆర్ ఆర్థిక సాయాన్ని అందించారు. అలాగే రెండో విడత గొర్రెల పంపిణీ కింద లబ్దిదారులకు కేసీఆర్ గొర్రెలను పంపిణీ చేశారు. పలు ప్రాజెక్ట్‌లకు సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. రూ.1,748 కోట్లతో చెన్నూర్‌, పర్ధాన్‌పల్లి లిఫ్ట్‌ ఇరిగేషన్‌ పథకాలకు, రూ.510 కోట్లతో మెడికల్‌ కాలేజీ, రూ.500 కోట్లతో మందమర్రి దగ్గర ఏర్పాటు చేయనున్న ఆయిల్‌ పాం ఫ్యాక్టరీ నిర్మాణ ప‌నుల‌కు, గోదావరిపై రూ.164 కోట్లతో నిర్మించే మంచిర్యాల-అంతర్గాం బ్రిడ్జికి కేసీఆర్ శంకుస్థాప‌న చేశారు.

Also Read: బీసీల్లోని వృత్తికులాలకు ఆర్థికసాయం..

ఈ సందర్భంగా మాట్లాడుతూ…అభివృద్ధి సంక్షేమ ఫలాలను ప్రజలకు చేరవేస్తున్న అధికారులకు అభినందనలు తెలిపారు. గొర్రెల పెంపకంలో తెలంగాణ మొదటి స్థానంలో ఉందన్నారు. మానవీయ కోణంలో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని అన్నారు. ఆరోగ్య శాఖ బ్రహ్మండమైన పురోగతి సాధిస్తుందన్నారు. కంటి వెలుగు లాంటి పథకం దేశంలో మరే రాష్ట్రంలో లేదన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ప్ర‌శాంత్ రెడ్డి, ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి, గంగుల క‌మ‌లాక‌ర్, సీఎస్ శాంతికుమారి, ఎంపీ వెంక‌టేశ్ నేత‌, ఎమ్మెల్యేలు బాల్క సుమ‌న్, దుర్గం చెన్న‌య్య‌, జోగు రామ‌న్న‌, దివాక‌ర్ రావు, రేఖా నాయ‌క్‌తో పాటు ప‌లువురు ప్ర‌జాప్ర‌తినిధులు పాల్గొన్నారు.

Also Read: CMKCR:దేశంలోనే నెంబర్‌ వన్ తెలంగాణ

- Advertisement -