ఈ మద్య తెలంగాణలో కంటే మహారాష్ట్రలోనే బిఆర్ఎస్ కు సంబంధించిన చర్చ ఎక్కువగా జరుగుతోంది. అక్కడి స్థానిక పార్టీలకు సైతం షాక్ ఇచ్చేలా బిఆర్ఎస్ విస్తరిస్తున్న తీరు అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. తెలంగాణ పక్క రాష్ట్రమే కావడంతో ఇక్కడ జరిగిన అభివృద్దికి ఆకర్షితులౌతున్న మహారాష్ట్ర ప్రజలు బిఆర్ఎస్ కు బ్రహ్మరథం పడుతున్నారు. ప్రజల్లో బిఆర్ఎస్ కు పెరుగుతున్న మద్దతు చూస్తున్న అక్కడి స్థానిక పోలిటికల్ లీడర్స్ సైతం బిఆర్ఎస్ వైపు చూస్తున్నారు. ఇంకా చెప్పాలంటే శివసేన, బీజేపీ వంటి పార్టీలకు షాక్ ఇచ్చేలా అక్కడ చేరికలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే శివసేన మరియు ఇతర పార్టీల నుంచి నేతలు, మాజీ నేతలు ఎందరో బిఆర్ఎస్ గూటికి చేరారు.
Also Read:కాంగ్రెస్ గూటికే పొంగులేటి?
అక్కడ ఎనికలకు ఇంకా ఏడాది సమయం ఉండడంతో ఈలోగా ఇంకా చాలానే చేరికలు జరిగి బిఆర్ఎస్ బలమైన శక్తిగా అవతరించే ఛాన్స్ ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇక తాజాగా బీజేపీ, శివసేన పార్టీలకు సంబంధించిన మరికొంత మంది నేతలు ప్రగతి భవన్ లో కేసిఆర్ సమక్షంలో బిఆర్ఎస్ లో చేరారు. ఈ సందర్భంగా కేసిఆర్ మాట్లాడుతూ మహారాష్ట్రలో ఎన్నో సాధుపాయలు ఉన్నప్పటికి కనీసం త్రాగునీరు అందించడంలో కూడా అక్కడి ప్రభుత్వం విఫలం అయిందని సిఎం కేసిఆర్ చెప్పుకొచ్చారు. రాబోయే రోజుల్లో ,మహారాష్ట్రలోని 288 నియోజిక వర్గాల్లో బిఆర్ఎస్ విస్తృత కార్యక్రమాలు చేపడుతుందని, పార్టీ కి సంబంధించి సోషల్ మీడియా, కరపత్రాలతో విస్తృత ప్రచారం చేయాలని ఆయన అన్నారు. మహారాష్ట్రలో తెలంగాణ తరహా పాలన కచ్చితంగా అందిస్తామని సిఎం హామీ ఇచ్చారు. మొత్తానికి మహారాష్ట్రలో బిఆర్ఎస్ దూకుడు ఇతర పార్టీలను సైతం కుదేలు చేస్తోంది. మరి రాబోయే రోజుల్లో బిఆర్ఎస్ మహారాష్ట్రలో ఎలాంటి సంచలనలు క్రియేట్ చేస్తుందో చూడాలి.
Also Read:శృంగార సన్నివేశాలపై కాజల్ ఆసక్తి