టాలీవుడ్ లో ప్రస్తుతం పెళ్లిళ్ల హడావుడి మొదలైంది. మొన్నే హీరో శర్వానంద్ పెళ్లి చేసుకున్నాడు. తాజాగా మెగా హీరో వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠి పెళ్లిపై అధికారిక ప్రకటన వచ్చేసింది. వీరిద్దరి లవ్‌ను మెగా ఫ్యామిలీ కన్ఫర్మ్ చేసింది. ఈ మేరకు జూన్ 9న వీరి నిశ్చితార్థం నిర్వహించబోతున్నట్టు తెలిపింది. వరుణ్ – లావణ్య కొత్త ప్రయాణానికి ఆల్ ది బెస్ట్ చెబుతూ.. ఓ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కుటుంబసభ్యుల సమక్షంలో ఈ ఎంగేజ్ మెంట్ వేడుక జరగనున్నట్లు తెలుస్తోంది.
అలాగే మరో హీరోయిన్ మేఘా ఆకాష్ కూడా పెళ్లికి రెడీ అయింది. నితిన్ ‘లై’ సినిమాతో హీరోయిన్ గా మేఘా ఆకాష్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. తాజాగా, మేఘా ఆకాష్ పెళ్లికి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ అమ్మడు త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్లు సమాచారం. తమిళనాడుకు చెందిన రాజకీయ నాయకుడు కుమారుడితో మేఘా పెళ్లి ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. త్వరలో ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించనున్నారని తెలుస్తోంది.
Also Read: భగవంత్ కేసరి..రెస్పాన్స్ అదుర్స్
ఇక నిన్నే బాలీవుడ్ ప్రముఖ నటి సోనాలి సైగల్ కూడా తన చిరకాల స్నేహితుడు అపేష్ ఎల్ సజ్నానీని పెళ్లి చేసుకుంది. వీరి పెళ్లి ముంబైలో కొద్దిమంది అతిథుల మధ్య జరిగింది. బాలీవుడ్‌లో తన తొలి సిరీస్ ‘ప్యార్ కా పంచ్‌నామా’తో మంచి గుర్తింపు తెచ్చుకున్న సోనాలి.. ముంబైలో ఓ రెస్టారెంట్ ఓనర్ అయిన సజ్నానితో కొద్దికాలంగా ప్రేమాయణం నడిపిస్తుంది. ఎంతో కాలంగా డేటింగ్‌లో ఉన్న వీరిద్దరూ ఈ రోజు మూడు ముళ్లతో ఏకమయ్యారు. మొత్తమ్మీద ఓ వారం రోజుల వ్యధిలోనే ముగ్గురు హీరోయిన్లు, ఇద్దరు హీరోలు పెళ్లి మూడ్ లోకి వెళ్ళిపోయారు.
Also Read: తిరుమల కొండపై వికృత చేష్టలు..ఓంపై ఆగ్రహం