నేటి నుండి మృగశిర కార్తె ప్రారంభమైంది. మృగశిర కార్తె ప్రవేశించడంతో రోకండ్లను సైతం పగుల గొట్టే ఎండలు వెళ్లిపోతాయి. వానలతో పాటు చల్లని, చక్కని వాతావరణాన్ని మృగశిర కార్తె మోసుకొస్తుంది. ఎండకాలం తర్వాత వాతావరణం చల్లబడడంతో మన శరీరంలోనూ ఉష్ణోగ్రత తగ్గుతుంది.
అందుకే ఇవాళ ప్రత్యేకంగా చేపలను తింటారు. వేడి ఉండేందుకు చేపలను తింటారు. తద్వారా గుండె జబ్బులు, అస్తమా రోగులకు ఉపశమనం కలుగుతుంది. దీనికి తోడు చేపలల్లో పుష్కలమైన పౌష్టికాహార పదార్థాలు ఉండటం కూడా చేపలు తినడానికి ఓ కారణం.
Also Read:NBK 108:భగవంత్ కేసరి ఫిక్స్
పురాతన సంప్రదాయాల ప్రకారం ఒక్కో కార్తెలో ఒక్కో విధంగా ప్రకృతిలో మార్పులు జరుగుతుంటాయి. ఈ క్రమంలో సూర్యుడు మృగశిర నక్షత్రంలోకి ప్రవేశించి నాటినుంచి నైరుతి రుతుపనాలు వస్తాయి. వాతావరణం ఒక్కసారి చల్లబడటం , ప్రకృతిలో అనేక మార్పులు చోటు చేసుకునే నేపథ్యంలో అనేక రకాల చెడు సూక్ష్మీక్రిములు వంటివి పునురుత్పత్తి అవుతాయి. మానవునిలో రోగ నిరోధకశక్తి తగ్గి జ్వరం , దగ్గు , శ్వాస సంబంధ వ్యాధులు వస్తాయి. మృగశిర కార్తెలో చేపలు తినడం వల్ల అనారోగ్య సమస్యల నుంచి కాపాడుకోవచ్చని వినికిడి.
పూర్వీకులు ఇంగువను బెల్లంలో కలుపుకొని ఉండలు.. ఉండలుగా చేసుకుని తినేవారు. మాంసాహారులైతే చేపలను ఇంగువలో , చింత చిగురులో పెట్టుకుని తినేవారు. చేపలలో ఎన్నో పోషకాలున్నాయంటున్నారు వైద్య నిపుణులు. చేపలలో అనేకమైన మాంసకృతులతో పాటు శరీరానికి మేలు చేసే గుణాలు ఎన్నో ఉన్నాయి. కాల్షియం , పాస్పరస్ , ఐరన్ , మెగ్నీషియం , కాపర్ , జింక్ వంటి ఖనిజ పోషకాలు ఎన్నో లభిస్తాయి.
Also Read:నిరాశలో ప్రగ్యా.. కారణం అదే
చేపల్లో ఉన్న కొవ్వు మన శరీరంలో రక్త పీడనంపై మంచి ప్రభావం చూపుతాయి. ఓమేగా 3 కొవ్వు ఆమ్లాలలో డీహెచ్‌ఏ , ఈపీఏ వంటివి కంటి చూపునకు ఎంతో మేలు చేస్తాయి. అలాగే జ్ఞాపకశక్తిని కూడా పెంచుతాయి. చేపల్లో బీ12 విటమిన్ , రైబోప్లవిన్ , నియాసిన్ , బయెటిక్ , థయామిన్ తదితర విటమిన్లు లభిస్తాయి.