సీఎం కేసీఆర్ ఇవాళ నాగర్‌కర్నూల్ జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లా కేంద్రంలో నిర్మించిన ఆధునిక సమీకృత కలెక్టరేట్ భవనాన్ని ప్రారంభించనున్నారు. అలాగే బీఆర్‌ఎస్ పార్టీ జిల్లా కార్యాలయాన్ని ప్రారంభించి అనంతరం ఏర్పాటుచేసిన బహిరంగసభలో పాల్గొని ప్రసంగించనున్నారు. సీఎం కేసీఆర్ రాక నేపథ్యంలో బీఆర్‌ఎస్ నేతల హోర్డింగ్స్, ఫ్లెక్సీలతో గులాబీమయంగా మారింది నాగర్‌కర్నూల్.
రూ.60కోట్లతో నిర్మించిన సమీకృత కలెక్టరేట్, రూ.35కోట్లతో నిర్మించిన పోలీస్ హెడ్‌క్వార్టర్ ని నిర్మించారు. అలాగే నాగర్‌కర్నూల్‌లో రూ.65కోట్లతో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ పనులను చేపట్టారు. ఉమ్మడి జిల్లాలోనే తొలి ఈ డ్రైనేజీ వ్యవస్థ కలిగిన పట్టణంగా కందనూలు రికార్డు సృష్టించింది. సుందరీకరణలో భాగంగా రూ.50కోట్లతో మున్సిపల్ పరిధిలోని అన్ని వీధుల్లో సీసీ రోడ్లు వేశారు.
Also Read:హాయిగా నవ్వుకునే అన్‌స్టాపబుల్: డైమండ్ రత్నబాబు
రూ.60కోట్లతో జడ్చర్ల -నాగర్‌కర్నూల్ వయా సిర్సవాడ ఆర్‌అండ్‌బీ రహదారి పనులు నడుస్తున్నాయి. రూ.11కోట్లతో వెజ్, నాన్‌వెజ్ సమీకృత మార్కెట్ సముదాయం పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. రూ.1.20కోట్లతో పట్టణంలో జంక్షన్ల ఆధునీకరణ. ఉయ్యాలవాడ, కొల్లాపూర్ పనులు పురోగతిలో ఉన్నాయి. రూ.35లక్షలతో కలెక్టరేట్ వద్ద మిషన్ భగీరథ పైలాన్‌ను ఏర్పాటు చేశారు. రూ.20లక్షలతో స్ట్రీట్ వెండింగ్ జోన్ నిర్మాణం, మరో రూ.50లక్షలతో కొత్తగా పనులు చేపట్టారు.రూ.30కోట్లతో నిర్మించిన మినీ ట్యాంక్‌బండ్ జిల్లాకేంద్రానికే తలమానికంగా మారింది. నీటి మధ్యలో బుద్ధ విగ్రహం, పక్కనే బతుకమ్మ ఘాట్, బ్రిడ్జి పట్టణవాసులను ఆకట్టుకుంటున్నాయి. రూ.2.5లక్షలతో జాతీయజెండాను ఆకర్షణీయంగా ఏర్పాటు చేశారు.
Also Read:మళ్ళీ సిఎం కేసిఆరే.. వారికి ముందే తెలుసా ?