ప్రయాణంలో వాంతులా..ఈ చిట్కాలు మీ కోసమే!

42
- Advertisement -

చాలామందికి దూర ప్రయాణాలు ఎంతో ఇబ్బంది కలుగజేస్తుంటాయి. ముఖ్యంగా కార్లలోగానీ, లేదా బస్సులోగాని ప్రయాణం చేసేటప్పుడు తరచూ వాంతులు చేసుకుంటూ ఉంటారు. అలాంటికి ప్రయాణం అంటేనే విసుగు వచ్చేస్తుంది. అయితే ఇలా ప్రయాణాల్లో వాంతులు చేసుకోవడాన్ని వైద్య పరిభాషలో మోషన్ సిక్ నెస్ అంటారు. దీనిని చాలమంది వ్యాధిగా భావిస్తుంటారు. అయితే ఇది వ్యాధి కాదు. మొదడుకు మరియు నాడీ వ్యవస్థకు మద్య జరిగే అంతరాయం కారణంగా మోషన్ సిక్ నెస్ ఎదురవుతుంది. కార్లలో అతివేగంగా ప్రయాణించడం లేదా బస్సులో ప్రయాణించే టప్పుడు అందులోని వాతావరణం అనుకూలించకపోవడం వంటి కారణాలతో మెదడు కొంత గందరగోళానికి గురవుతుంది. .

ఫలితంగా వాంతులు ఏర్పడతాయి. ఇలా ప్రయాణ సమయాల్లో వాంటింగ్ సెన్షన్ అవ్వడం వల్ల ఎంతో నిరసానికి లోనవుతూ ఉంటారు. జర్నీలో ఎలాంటి ఆహార పదార్థాలు తిన్న అజీర్తికి గురవ్వాల్సి వస్తుంది. తద్వారా వాంతులతో పాటు విరోచనలు కూడా కలిగే అవకాశం ఉంది. అయితే ఇలా ప్రయాణ సమయాల్లో వాంతులు చేసుకునే వారికి ఆయుర్వేదంలో ఉన్న అద్బుతమైన చిట్కాలు చక్కగా పని చేస్తాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి సమస్య ఉన్న వాళ్ళు ప్రయాణ సమయాల్లో కచ్చితంగా నిమ్మకాయ వెంట తీసుకెళ్లాలని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. నిమ్మకాయలో ఉండే సిట్రిక్ ఆమ్లం కారణంగా వాంతులు తగ్గి బ్రెయిన్ ఉత్తేజానికి లోనవుతుంది.

Also Read:ఎత్తును పెంచే “తాడాసనం”!

ఇక లవంగాలు కూడా ప్రయాణ సమయాల్లో వాంతులను తగ్గించడంలో సహాయ పడతాయి. వేయించిన లవంగాలను జర్నీ సమయాల్లో నములుతూ ఉంటే వాంటింగ్ సమస్య ఉండదు. ఇక తులసి ఆకులను నములుతూ ఉండడం వల్ల కూడా ఈ మోషన్ సిక్ నెస్ కు చెక్ పెట్టవచ్చు. ఇంకా జర్నీ సమయాల్లో విండో సీట్ వద్ద కూర్చొని స్వచ్చమైన గాలి పీల్చడం వల్ల వాంటింగ్ సమస్య రాదు. అలాగే ఈ మోషన్ సిక్ నెస్ ఉన్నవాళ్ళు జర్నీ సమయాల్లో పుస్తకాలు చదవడం, మొబైల్ చూస్తూ ఉండడం, అతిగా తినడం, తినకపోవడం వంటివి చేయకూడదు. అందువల్ల పై చిట్కాలు పాటిస్తూ.. ఈ జాగ్రత్తలు పాటిస్తే మోషన్ సిక్ నెస్ సమస్యకు చెక్ పెట్టవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

- Advertisement -