బలపడుతున్న బీఆర్ఎస్ దేశవ్యాప్తంగా పోటీకి సై

54
- Advertisement -

తెలంగాణ ఉద్యమనేత, సీఎం కేసీఆర్ ప్రారంభించిన బీఆర్ఎస్ పార్టీ దేశవ్యాప్తంగా విస్తరిస్తోంది. అబ్‌కీ బార్ కిసాన్ సర్కార్‌ లక్ష్యంగా పనిచేస్తున్న బీఆర్‌ఎస్‌ పార్టీ మరింత విస్తరిస్తోంది. ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్,ఒడిశా, పంజాబ్, కర్ణాటక లాంటి రాష్ట్రాల్లో బలమైన ప్రాంతీయ, జాతీయ పార్టీలు ఉన్న… బీఆర్ఎస్ పార్టీ కూడా చాప కింద నీరులా విస్తరిస్తుంది.

Also Read: బీజేపీని కలవర పెడుతున్న ఆ ఇద్దరు !

మహారాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని గ్రామాల్లో బీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి 10 కమిటీలను ఇప్పటికే ఏర్పాటు చేశారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా పార్టీ మరింత బలపడునుంది. అందుకే సీఎం కేసీఆర్ మహారాష్ట్రలో 288 అసెంబ్లీ స్థానాల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ పోటీ చేయనున్నట్టు సమాచారం. ఇప్పటికిప్పుడే ఎలక్షన్‌లు నిర్వహించిన 50కి పైగా స్థానాల్లో బీఆర్ఎస్ గెలుపొందుతుందని సీఎం కేసీఆర్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ హవా కొనసాగనుంది. కనీసం 30కి పైగా లోక్‌సభ స్థానాల్లో గెలవనుందని సమాచారం. ఈ మేరకు సీఎం కేసీఆర్ వ్యూహ రచనలు చేస్తున్నారు.

Also Read: రెజ్లర్ల ఆరోపణలన్ని.. వట్టివే ?

- Advertisement -