ఆయనెప్పుడూ సూపర్ హీరోనే

51
- Advertisement -

తెలుగు సినిమా స్థాయిని పెంచిన వ్యక్తి ‘సూపర్ స్టార్ కృష్ణ’. నేడు ఆయన జయంతి. ఆయన గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం. కృష్ణ మాటల మనిషి కాదు, చేతల మనిషి. అందుకే కృష్ణ అదృష్టాన్ని ఎప్పుడు నమ్ముకోలేదు. శ్రమనే పెట్టుబడిగా పెట్టి, తనదైన కోణంలో తెలుగు వెండితెరపై వెలిగిపోయిన సూపర్ హీరో ఆయన. కానీ, సాధారణ శివరామకృష్ణ, సూపర్ స్టార్ కృష్ణ గా మారడానికి ఆయన చాలా కృషి చేశారు. మద్రాసు మహానగరంలో అడుగుపెట్టిన రోజున ఆయనకు ఎలా మాట్లాడాలో కూడా తెలియదు. కానీ, నాలుగేళ్లలోనే ఆయన దగ్గర మాట తీసుకోవడానికి మహామహా నిర్మాతలు, దిగ్గజ దర్శకులు సైతం క్యూలో నిలబడ్డారు.

కృష్ణ గారు హీరోగా నటించిన మొదటి సినిమా తేనెమనసులు. నిజానికి ఈ సినిమా రిలీజ్ సమయంలో సినిమా వాళ్లలో ఎవరూ ఆయన పై పెద్దగా ఆసక్తి చూపించలేదు. కానీ, ప్రేక్షకులు మాత్రం ‘అరె ఎవరు ఈ కుర్రాడు.. బాగా చేస్తున్నాడు, పైగా భలే ఉన్నాడు’ అంటూ ముచ్చట పడ్డారు. దాంతో నిర్మాతల చూపు కృష్ణ వైపు పడింది. వచ్చిన డిమాండ్ ను క్యాష్ చేసుకోవాలని కృష్ణ ఏ నాడు అనుకోలేదు. హీరోగా నిలబడాలని ఆయన నిత్యం తపన పడేవారు. ఆ గుణమే ఆయనకు నిర్మాతలను బాగా దగ్గర చేసింది.

Also Read:టర్కీలో ఖుషీగా సామ్-విజయ్!

కేవలం కృష్ణ డబ్బు మనిషి కాకపోవడం వల్లే.. ఆయన డేట్లు కోసం నిర్మాతలు ఎగబడ్డారు. ఈ క్రమంలోనే కృష్ణకు మంచి కథలు పడ్డాయి. తక్కువ సమయంలోనే స్టార్ గా ఎదిగారు. అలాగే, దర్శకుడిగా, నిర్మాతగా తెలుగు సినిమాకు సరికొత్త టెక్నాలజీని అందించిన ఘనత కూడా కృష్ణ గారికే దక్కింది. తెలుగులో తొలి జేమ్స్‌బాండ్ సినిమా కృష్ణ గారు చేసిన గూఢచారి 116 సినిమానే. అలాగే తెలుగులో తొలి కౌబాయ్ సినిమా కూడా కృష్ణ గారు చేసిన మోసగాళ్ళకు మోసగాడు సినిమానే. అదే విధంగా తొలి ఫుల్‌స్కోప్ సినిమా అల్లూరి సీతారామరాజు. తొలి 70 ఎంఎం సినిమా సింహాసనం. ఇవి చాలావా కృష్ణ గారి గొప్పతనం తెలుసుకోవడానికి. అందుకే, ఆయనెప్పుడూ సూపర్ హీరోనే.

Also Read:CM KCR:బ్రహ్మణులకు వరాల జల్లు

- Advertisement -