హ్యాపీ బర్త్ డే..అంబరిష్

48
- Advertisement -

విలన్‌గా కెరీర్ ప్రారంభించి తర్వాత హీరోగా, రాజకీయ నాయకుడిగా తనకంటూ ఓ ఇమేజ్ సంపాదించుకున్నారు అంబరిష్‌. కన్నడ రెబల్‌ స్టార్‌గా పేరు తెచ్చుకున్న అంబరిష్ బర్త్ డే నేడు.

1952 మే 29న మైసూర్ స్టేట్(ప్రస్తుతం:కర్ణాటక రాష్ట్రం), మండ్య జిల్లా, దొడ్డరాశినకెరే గ్రామంలో జన్మించారు. హుచ్చెగౌడ, పద్మమ్మ దంపతుల ఏడుగురు సంతానంలో ఆరవవాడు అంబరిష్. అసలు పేరు అమర్‌నాథ్. 200కి పైగా సినిమాల్లో నటించాడు. ప్రముఖ తెలుగు నటి సుమలతను వివాహం చేసుకోగా వీరికి అభిషేక్ కొడుకు ఉన్నారు. అభిషేక్ కూడా సినీ నటుడే.

Also Read:హరి హార వీరమల్లు సెట్స్‌లో అగ్నిప్రమాదం!

1972లో తొలిసారిగా వెండితెరకు పరిచయం అన్నారు. తర్వాత కన్నడ, తమిళ, మలయాళ, తెలుగు, హిందీ చిత్రాలలో నటించారు. ఏపీ ప్రభుత్వం ఎన్.టి.ఆర్. పురస్కారం, ఫిల్మ్‌ఫేర్ ఉత్తమ నటుడు పురస్కారం, ఫిల్మ్‌ఫేర్ జీవిత సాఫల్య పురస్కారం, కర్ణాటక ప్రభుత్వం నుండి విష్ణువర్ధన్ పురస్కారం మొదలైన పురస్కారాలు లభించాయి.

1994 లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. 1996 ఎన్నికల్లో పార్టీ టెకెట్ దక్కకపోవడంతో జనతాదళ్ పార్టీలో చేరి 1998 నుంచి మండ్య నియోజకవర్గం నుండి శాసనసభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు. తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరి మండ్య పార్లమెంటరీ నియోజక వర్గం నుంచి ఎంపిగా ఎన్నికయ్యారు. 14 వ లోక్ సభలో ప్రసార్ శాఖ మంత్రి (స్టేట్) గా పనిచేశారు.

Also Read:తెలంగాణ…ఆవిర్బావం ప్రత్యేకం

- Advertisement -