హీరోయిన్ ఇంట్లోకి అపరిచితులు

18
- Advertisement -

హీరోయిన్ డింపుల్ హయాతి ఇంట్లోకి ఇద్దరు అపరిచితులు ప్రవేశించారు. వారెవరని పనిమనిషి ఆరా తీస్తుండగానే బయటకు వెళ్లిపోయినట్టు తెలుస్తోంది. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. ఆ ఇద్దరినీ అదుపులోకి తీసుకుని విచారించారు. సాయిబాబు, శృతిగా పోలీసులు గుర్తించారు. తాము డింపుల్ అభిమానులమని.. ఆమెను కలవడానికే ఇంటికి వెళ్లినట్లు పోలీసులతో చెప్పారు. దీంతో, వారికి కౌన్సిలింగ్ ఇచ్చి వదిలేశారు. అయితే, డింపుల్ హయాతి మాత్రం తనను ఏదో చేయడానికే వాళ్ళు వచ్చారని ఆరోపిస్తోంది.

గత కొన్ని రోజులుగా డింపుల్‌ హయాతి, ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డేల మధ్య గొడవ జరుగుతూ ఉంది. మొత్తమ్మీద డింపుల్‌ రాహుల్ హెగ్డే వివాదంలో సంచలన విషయాలు బయటకొస్తున్నాయి. తాజాగా డింపుల్ హయాతితో డీసీపీ రాహుల్ హెగ్డే అసభ్యంగా ప్రవర్తించారని ఆమె తరపు అడ్వకేట్ పాల్ సత్యనారాయణ వెల్లడించారు. ‘‘ప్రస్తుతం ఆమె డిప్రెషన్‌లో ఉన్నారు. రోజూ ఆమెకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. కనీసం బయటకు వచ్చేందుకు కూడా డింపుల్ భయపడుతున్నారు’’ అని డింపుల్ లయార్ పేర్కొన్నారు.

Also Read:Karthi:దీపావళికి జపాన్

అసలు డింపుల్‌ హయాతి, డీసీపీ రాహుల్‌ మధ్య ఏం జరిగింది అంటే.. నాలుగు నెలలు క్రితం డీసీపీ పెట్ డాగ్ ను హింసిస్తుంటే డింపుల్ వారించారు, దీంతో, కక్ష పెంచుకున్న డీసీపీ ఆమెతో అసభ్యంగా ప్రవర్తించారట. పైగా డీసీపీ కావాలనే డింపుల్ పై కేసులు పెట్టినట్టు తెలుస్తోంది. మరి ఈ వివాదం ఎటు వైపు వెళ్తుందో చూడాలి. ఈ నేపథ్యంలో డింపుల్ ఇంట్లోకి ఇద్దరు అపరిచితులు వెళ్ళడం హాట్ టాపిక్ అయింది.

- Advertisement -