యోగాసనాలలో ఉండే కష్టతరమైన ఆసనాలలో ఏకపాద విపరీత దండాసనం కూడా ఒకటి. ఏక పాదము అండగా ఒకే పదము దండము అనగా కర్ర అనే అర్థం వస్తుంది. అనగా ఒకే పాదము మీద కర్రవలే నిటారుగా చేయు ఆసనం అనే అర్థం వస్తుంది. ఈ ఆసనం ప్రతిరోజూ సాధన చేస్తూ వేయడం వల్ల శరీరానికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనలు కలుగుతాయి. ముఖ్యంగా వెన్నెముక ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది. వెన్ను సమస్యలు దురమౌతాయి. అలాగే నాడీ వ్యవస్థ క్రమబద్దీకరించబడుతుంది. ఉదర సమస్యలు కూడా దురమౌతాయి. మలబద్దకం వంటి సమస్యలకు ఈ ఆసనం చక్కటి నివారణగా ఉపయోగ పడుతుంది. కాళ్ళ శక్తినొందుతాయి.
Also Read:స్టోన్ ఫ్రూట్స్ తో క్యాన్సర్ కు చెక్!
ఏకపాద విపరీత దండాసనం వేయు విధానం .
ముందుగా రెండు కాళ్ళు దగ్గర ఉంచుకొని నిటారుగా నిలబడాలి. ఆ తరువాత చేతులను పైకెత్తి నడుము భాగం వరకు వెనుకకు వంచి చేతులను నేలకు ఆనించాలి. ఆ తరువాత చేతుల నుంచి భారాన్ని మెల్లగా తలపై మోపుతూ రెండు చేతులను తలకు సపోర్ట్ గా ఉంచాలి. ఇలా చేస్తున్నప్పుడు శ్వాసను బిగబట్టి ఉంచరాదు.. శ్వాస క్రియ నెమ్మదిగా జరిగించాలి. ఆ తరువాత ఎడమ కాలుపై భారం మోపుతూ మెల్లగా కుడి కాలును పైకెత్తి నిటారుగా 90 డిగ్రీల కోణంలో ఉంచాలి. ఇలా వీలైనంతా సమయం ఈ భంగిమలో ఉంచి ఆ తరువాత మళ్ళీ ఎడమ కాలుతో కూడా ఇదే విధంగా చేయాలి. ఇలా ఈ ఆసనం 10-15 నిముషాల పాటు వేయాలి.
గమనిక
నడుం నొప్పి అధికంగా ఉన్నవాళ్ళు, కడుపు భాగంలో సర్జరీకి గురైన వాళ్ళు ఈ ఆసనం వేయరాదు.