రాజకీయ నాయకులు ఎప్పుడు ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారో ఊహించడం కష్టం. కొన్ని సార్లు వారు చేసే వ్యాఖ్యలు సొంత పార్టీనే ఇరకాటంలో పడేస్తుంటాయి. ఆ తరువాత వారు చేసిన వ్యాఖ్యలను ఎంత సమర్థించుకున్న.. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. సరిగ్గా ఇప్పుడు బీజేపీ విషయంలో ఈటెల చేసిన వ్యాఖ్యలు ఇలాగే ఉన్నాయి. బిఆర్‌ఎస్ సర్కార్ పై బురద చల్లే క్రమంలో పక్కా రాష్ట్రం ఏపీ సర్కార్ తో పోల్చుతూ ఈటెల రాజేంద్ర చేసిన వ్యాఖ్యలు.. తిరిగి ఆయనకే బెడిసి కొడుతున్నాయి. ఇక అసలు విషయంలోకి వెళ్తే.. కేసిఆర్ అధికారంలోకి వచ్చిన తరువాత పేదలకు ఇళ్ల స్థలాల కోసం ఎటువంటి భూమి ఇవ్వలేదని.. పక్కా రాష్ట్ర సిఎం జగన్మోహన్ రెడ్డి పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించడంలో ముందున్నరని ఈటెల రాజేంద్ర వ్యాఖ్యానించారు.
Also Read:IPL 2023 : ఫైనల్ కు వెళ్ళేదేవరు..?
అయితే ఏపీ బీజేపీ నేతలు మాత్రం ఇంకోలా చెబుతున్నారు. పేదలకు ఇంటి స్థలాలు కేటాయించడంలో జగన్ సర్కార్ పూర్తిగా విఫలం అయిందని, ఇంటి స్థలాల కోసం కేంద్రం నుంచి వచ్చిన నిధులను కూడా జగన్ సర్కార్ స్వాహా చేస్తోందని.. ఇంటి స్థలాల పనులు మాత్రం జరగడం లేదని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఇటీవల ఘాటైన వ్యాఖ్యలు చేశారు. దాంతో ఇంటి స్థలాల విషయంలో ఏపీ సర్కార్ ను మెచ్చుకున్న ఈటెలపై నెటిజన్స్ ఘాటుగా విరుచుకుపడుతున్నారు. అటు ఏపీ సర్కార్ పై ఇటు తెలంగాణ సర్కార్ పై కనీసపు అవగాహన లేకుండా విమర్శలు చేయడం ఈటెల ముర్కత్వపు వైఖరిని నిదర్శనం అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. దీంతో ఈటెల చేసే వ్యాఖ్యలన్నీ కూడా అవగాహన లేమితో చేసినవే అనే భావన ప్రజల్లో కలిగే అవకాశం ఉంది.
Also Read:9 సంవత్సరాలు..68 దేశాలు