ఐపీఎల్ 2023లో భాగంగా ఫైనల్‌కు చేరింది చెన్నై. చెపాక్ వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 15 పరుగుల తేడాతో విజయం సాధించి ఫైనల్లోకి ప్రవేశించింది ధోని సేన.173 పరుగుల లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన గుజరాత్ 20 ఓవర్లలో 157 పరుగులకు ఆలౌట్ అయింది. శుభ్‌మన్ గిల్(42; 38 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్) రాణించగా సాహా(12), హార్దిక్ పాండ్యా(8), డేవిడ్ మిల్లర్(4), విజయ్ శంకర్(14), దసున్ శనక(16)లు విఫలం అయ్యారు. ఆఖర్లో రషీద్ ఖాన్(30; 16 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లు) పర్వాలేదనిపించారు.
Also Read:నాలుగేళ్ల జగన్ పాలన.. ఏంటి పరిస్థితి!
ఇక అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నైకి ఓపెనర్లు మంచి శుభారంబాన్ని అందించారు. రుతురాజ్ గైక్వాడ్(60; 44 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్) అర్ధశతకంతో రాణించగా డేవాన్ కాన్వే(40; 34 బంతుల్లో 4 ఫోర్లు) పర్వాలేనిపించాడు. శివమ్ దూబే(1), మహేంద్ర సింగ్ ధోని(1) లు విఫలం కాగా అజింక్యా రహానే(17), అంబటి రాయుడు(17),జడేజా 22 పరుగులు చేశారు. దీంతో చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది.
Also Read:కాంగ్రెస్ లో ఇప్పటికైనా.. వర్గపోరు తగ్గేనా !