ఆ నలుగురిపై బీజేపీ నజర్ ?

48
- Advertisement -

తెలంగాణ రాష్ట్ర బీజేపీలో కలవరం మొదలైందా ? ఎప్పుడు ఏం జరుగుతుందో అన్న సందేహాలు బీజేపీ అధిష్టానాన్ని వేధిస్తున్నాయా? నేతలను నిలుపుకోవడమే బీజేపీకి సవాల్ గా మారుతోందా ? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. కర్నాటక ఎన్నికల ఫలితాలు ఎవరు కాదన్న తెలంగాణపై గట్టిగానే ప్రభావం చూపయనే చెప్పవచ్చు. తెలంగాణలో బి‌ఆర్‌ఎస్ కు ప్రత్యామ్నాయం మేమే. వచ్చే ఎన్నికల్లో అధికారం మాదే అని ఢంఖా భజయించి చెప్పిన కమలనాథులు.. ఇతర పార్టీల నుంచే నేతలను ఆకర్షించే ప్రయత్నం గట్టిగానే చేశారు. రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున చేరికలు ఉంటాయని, రాబోయే రోజుల్లో బీజేపీ రాష్ట్రంలో తిరుగులేని శక్తిగా నిలవబోతుందని కల్లబొల్లి కబుర్లతో కాలం వెళ్లదీసిన కాషాయ పార్టీకి ఇప్పుడు ఉన్న నేతలనే నిలుపుకోవడమే పెద్ద టాస్క్ అయింది. .

మరి ముఖ్యంగా కర్నాటక ఎన్నికల్లో ఓటమి తరువాత బీజేపీలోని అసంతృప్త నేతలు ఇతర పార్టీల వైపు చూస్తున్నారనే చర్చ జోరుగా సాగుతోంది. అయితే ఇతరత్రా కారణాలతో ఆయా పార్టీలలోని కొంత మంది నేతలు బీజేపీ గూటికి చేరారు. వారిలో ఈటెల రాజేంద్ర, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కొండ విశ్వేశ్వర రెడ్డి, వివేక్ వెంకటస్వామి వంటి వారిని ప్రధానంగా చెప్పుకోవచ్చు. ఈటెల బి‌ఆర్‌ఎస్ నుంచి బీజేపీలో చేరగా.. మిగిలిన ముగ్గురు కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరారు. అయితే వీరు మొదట ఉన్న పార్టీలో ఎంతో ప్రాధాన్యం ఉన్న నేతలుగా ఎంతో గుర్తింపు పొందారు. కానీ బీజేపీలో చేరిన తరువాత వీరి గుర్తింపుకు గండి పడిందనే చెప్పాలి.

Also Read:ఓటీటీ : ఏ చిత్రం ఎందులో ?

ఏదో ఆశించి బీజేపీలో చేరితే ఆ పార్టీ మాత్రం మొండి చేయి చూపిస్తూ వీరి ఆశలను నీరు గరుస్తోందనే వాదన ఎప్పటి నుంచో జరుగుతోంది. స్టార్ క్యాంపైనర్ హోదా ఆశించిన ఈటెలకు ప్రాధాన్యమే లేని చేరికల కమిటీ చైర్మెన్ చేసి నిరాశ పరిచింది. ఇక కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కొండ విశ్వేశ్వర రెడ్డి వంటి వారు అసలు బీజేపీలో ఉన్నారా లేరా అనే డౌట్ రాక మానదు. దీంతో ఆ నేతలు బీజేపీ అధిష్టానంపై అసహనంగా ఉన్నారని, వారు పార్టీ మారే అవకాశాలు ఉన్నాయని ఎప్పటి నుంచో గుసగుసలు వినిపిస్తున్నాయి. కర్నాటక ఎన్నికల్లో బీజేపీ ఓటమి తరువాత ఈ రకమైన వార్తలు మరి ఎక్కువగా వినిపిస్తున్నాయి.

దాంతో స్వయంగా ఈటెల, కోమటిరెడ్డి, కొండా వంటి వారు పార్టీ మారడం లేదని క్లారిటీ ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆ నలుగురి పేర్లు ప్రస్తావిస్తూ కాంగ్రెస్ లో చేరాలని ఓపెన్ ఆఫర్ ఇవ్వడంతో ఇప్పుడు బీజేపీ అధిష్టానంలో కలవరం మొదలైందట. ఎందుకంటే రాజకీయల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించలేము కాబట్టి.. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆ నలుగురు పార్టీ మారిన ఆశ్చర్యం లేదనే అనుమానాలు డిల్లీ పెద్దలలో మెదులుతున్నాయట. ఒకవైపు బీజేపీని వీడే ప్రసక్తే లేదని ఈటెల రాజేంద్ర, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కొండ విశ్వేశ్వర రెడ్డి, వివేక్ వంటి వారు చెబుతున్నప్పటికి.. ఈ నాలుగురిని బీజేపీ అధిష్టానం ఓ కంట కనిపెడుతూనే ఉందట. మరి ఈ నలుగురు బీజేపీకి షాక్ ఇస్తారో లేదో చూడాలి మరి.

Also Read:IPL 2023:పాపం ఆర్సీబీ.. ఏంటి ఈ పరిస్థితి !

- Advertisement -