IPL 2023:పాపం ఆర్సీబీ.. ఏంటి ఈ పరిస్థితి !

37
- Advertisement -

ఐపీఎల్ లో రాయల్ ఛాలెంజర్స్ జట్టు కు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. మ్యాచ్ ఫలితాలను క్షణాల్లో మార్చేసే హార్డ్ హిట్టింగ్ బ్యాట్స్ మెన్స్, పదునైన పేస్ దళం.. చురుకైన ఫీల్డింగ్ ఇలా అన్నీ విభాగాల్లోనూ పటిష్టంగా ఉన్న ఆర్సీబీ కి లక్ కలిసి రావడం లేదు. ప్రతి సీజన్ లోనూ ” సాలా కప్ నమ్ దే ” అంటూ బరీలోకి రాయల్ ఛాలెంజర్స్ జట్టుకు ప్రతి సీజన్ లోనూ నిరాశే ఎదురవుతోంది. ఇక ఈ సీజన్ లోనూ మరోసారి ఆర్సీబీకి నిరాశ తప్పలేదు.

నిన్న గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్ లో గెలిచి ప్లే ఆఫ్ కు వెళ్లాలని కలలుగన్న బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ ఆశలు అవిరయ్యాయి. మొదట బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ..విరాట్ కోహ్లీ విధ్వంసక సెంచరీతో చెలరేగగా నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 197 పరుగులు చేసింది. ఆ తరువాత లక్ష్య చేధనకు దిగిన గుజరాత్ టైటాన్స్ 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. శుబ్ మన్ గిల్ వీరోచిత సెంచరీ ఆ జట్టుకు విజయాన్ని అందించింది. దీంతో ప్లే ఆఫ్ రేస్ నుంచి ఆర్సీబీ నిష్క్రమించింది. ఇక అంతకు ముందు జరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరబాద్ పై ముంబై ఇండియన్స్ అద్భుత విజయాన్ని అందుకొని ఘనంగా ప్లే ఆఫ్ లో అడుగు పెట్టింది.

Also Read:Saffron:కుంకుమ పువ్వుతో ఆరోగ్యం….

గ్రీన్ అద్బుతమైన సెంచరీకి తోడు రోహిత్ శర్మ క్లాస్ ఇన్నింగ్స్ తోడు అవ్వడంతో ఎస్‌ఆర్‌హెచ్ నిర్దేశించిన 200 పరుగుల భారీ లక్ష్యాన్ని ముంబై ఇండియన్స్ రెండు వికెట్లు కోల్పోయి చేధించింది. దీంతో చివరి ప్లే ఆఫ్ బెర్త్ ముంబై ని వరించింది. అయితే ఒకవేళ గుజరాత్ టైటాన్స్ పై ఆర్సీబీ విజయం సాధించి ఉంటే నెట్ రన్ రేట్ ఆధారంగా ఆర్సీబీ ప్లే ఆఫ్ కు వెళ్ళే అవకాశాలు మెరుగ్గా ఉండేవి. కానీ ఆర్సీబీ ఓడిపోవడంతో ముంబై ఇండియన్స్ దర్జాగా ప్లే ఆఫ్ లో అడుగు పెట్టింది. మొత్తానికి ప్రతి సీజన్ లో మాదిరి కప్పు వేటలో అందరినీ ఆకర్షించిన ఆర్సీబీ ఎప్పటిలాగే మళ్ళీ ఇంటి ముఖం పట్టింది.

Also Read:IPL 2023:ప్లే ఆఫ్స్‌కు ముంబై

- Advertisement -