Siddharth:టక్కర్ ట్రైలర్

43
- Advertisement -

సిద్ధార్థ్ హీరోగా కార్తీక జీ క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘టక్కర్’. ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, పాషన్ స్టూడియోస్ తో కలిసి నిర్మిస్తున్నారు. వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాలో దివ్యాంశ కౌశిక్ కథానాయికగా నటిస్తున్నారు. ఈ చిత్రం జూన్ 9న తెలుగు, తమిళ భాషల్లో భారీ స్థాయిలో విడుదల కానుంది.

సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా ట్రైలర్‌ని రిలీజ్ చేశారు. ట్రైలర్ ఉత్కంఠభరితంగా, వినోదాత్మకంగా తెరకెక్కించారు. ఆశే ఈ లోకాన్ని నడిపిస్తుంది. అదే ఆశ మన లైఫ్ ని నిర్ణయిస్తుంది. ఆ ఆశని నెరవేర్చుకోడానికి ధనమే ఇంధనం. దానిని సంపాదించుకోడానికి ఒక్కొక్కరిది ఒక్కో దారి. ఆ దారి అందరికీ ఒకటైనప్పుడు” అంటూ సిద్ధార్థ్ చెప్పే డైలాగ్ తో ట్రైలర్ ఆసక్తికరంగా ప్రారంభమైంది.

Also Read:Saffron:కుంకుమ పువ్వుతో ఆరోగ్యం….

డబ్బు సంపాదించడమే లక్ష్యంగా పెట్టుకున్న సాధారణ యువకుడిగా కథానాయకుడు కనిపిస్తుండగా, బాగా డబ్బున్న యువతిగా కథానాయిక కనిపిస్తోంది. వారి మధ్య వచ్చే రొమాంటిక్ సన్నివేశాలు మెప్పిస్తున్నాయి. తనని ఎంతగానో నమ్మిన కథానాయికని డబ్బు కోసం కిడ్నాప్ చేయాల్సిన పరిస్థితి కథానాయకుడికి ఎందుకు వచ్చింది? వారిని ప్రతినాయకులు ఎందుకు వెంటాడుతున్నారు? కథానాయిక ఆత్మహత్యాయత్నానికి కారణం కథానాయకుడేనా? అనే ప్రశ్నలతో ఉత్కంఠను రేకెత్తిస్తూ ట్రైలర్ ఆద్యంత ఆసక్తికరంగా సాగింది.

- Advertisement -