CMKCR:దశాబ్దాలు పాలించిన కాంగ్రెస్ చేసింది శూన్యం

56
- Advertisement -

రైతులు బాగుపడిన రోజు దేశం బాగుపడుతుందని సీఎం కేసీఆర్ అన్నారు. నాందేడ్‌లో జరుగుతున్న బీఆర్ఎస్ పార్టీ శిక్షణ శిబిరాన్ని సీఎం జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం బీఆర్ఎస్ జెండాను ఆవిష్కరించారు. మరాఠా మహనీయుల చిత్రపటాలకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ…దేశాన్ని దశాబ్ధాల పాటు పాలించిన కాంగ్రెస్‌ పార్టీ దేశానికి చేసిందేమీ లేదని అన్నారు.

తెలంగాణలో అభివృద్ది గడిచిన 9యేళ్లలో చేశామని అన్నారు. ఇంతవరకు ఏరాష్ట్రం కూడా త్వరతగతిన అభివృద్ధి సాధించలేదని అన్నారు. దేశమంతటా ఒక మార్పు తేవాలనే ఉద్దేశంతోనే బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించిందన్నారు. దేశ రైతాంగం బాగుపడే వరకు బీఆర్ఎస్ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. దేశంలో పుష్కలంగా నీటి వనరులు ఉన్న వాడుకోలేక వృథాగా పోతున్నాయని అవేదన వ్యక్తం చేశారు. దేశంలో ఏటా 1.40లక్షల టీఎంసీల నీరు వృథాగా సముద్రంలో కలుస్తుందని అన్నారు. వీటిలో మనం కేవలం 20వేల టీఎంసీలను మాత్రమే వాడుకుంటున్నామని అన్నారు.

మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాల మధ్య ఒక ప్రత్యేక అనుబంధం ఉందని సీఎం కేసీఆర్ చెప్పారు. రెండు రాష్ట్రాలు వేల కిలోమీటర్ల మేర సరిహద్దును పంచుకుంటున్నాయని అన్నారు. ప్రస్తుతం దేశంలోని ప్రజలంతా తెలంగాణ మాడల్‌ కావాలని కోరుకుంటున్నారని అన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్‌ పార్టీ ఘన విజయం సాధించిందని, విద్వేష రాజకీయాలు చేసిన బీజేపీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుందని చెప్పారు. కర్ణాటక ఫలితాల తర్వాత కొందరు ఏదేదో మాట్లాడుతున్నారని, వారి కలలు కల్లలే అవుతాయని అన్నారు.

Also Read: CM KCR:వీఆర్ఏలకు రెగ్యులర్ స్కేల్

బీఆర్ఎస్ పార్టీ శిక్షణా శిబిరంలో పలువురు నేతలు ఇతర పార్టీల ముఖ్య నేతలు ప్రజాప్రతినిధులు చేరారు. కడదాకా నిలబడి పోరాడే వాళ్లు బీఆర్‌ఎస్ లో మాత్రమే చేరాలని పిలుపునిచ్చారు. పార్టీలో చేరేవారందరూ ప్రజల కోసం నిరంతరం పోరాడాలని నిత్యం ప్రజలతో మమేకమై ఉండాలని అన్నారు. శిక్షణ తరగతుల సమాచారాన్ని డిజిటల్ రూపంలో అందిస్తామని అని తెలిపారు.

Also Read: BRS: బి‌ఆర్‌ఎస్ కు ‘నో పోటీ’!

- Advertisement -