ఈసారి కష్టమే.. అవినాష్ రెడ్డి !

18
- Advertisement -

ఏపీలో సంచలనం సృష్టించిన మాజీమంత్రి వివేకా హత్యకేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వైఎస్ అవినాష్ రెడ్డి ఇప్పటికే పలుమార్లు సిబిఐ విచారణ ఎదుర్కొన్నా సంగతి తెలిసిందే. అయితే ఆ మధ్యనే అవినాష్ రెడ్డి అరెస్ట్ కావడం గ్యారెంటీ అని భావించరంతా. ఎందుకంటే ఈ కేసులో ఇప్పటికే నిందితులుగా ఉన్న వైఎస్ భాస్కర్ రెడ్డి, ఎర్రగంగిరెడ్డి, ఉదయకుమార్ రెడ్డి వంటివాళ్లు అరెస్ట్ కాబడ్డారు. దాంతో అవినాష్ రెడ్డి కూడా అరెస్ట్ కావడానికి ఎంతో సమయం లేదనే చర్చ నడిచింది. అయితే సిబిఐ విచారణ ఉన్న ప్రతిసారి అవినాష్ రెడ్డి హైకోర్టు ను ఆశ్రయించడం, హైకోర్టు అరెస్ట్ పై స్టే ఇవ్వడం, సిబిఐ విచారణకు అంతరాయం కలవడం వంటి పరిణామాలు చోటు చేసుకుంటూ వచ్చాయి.

అయితే ఈ కేసును జూన్ 30 నాటికి దర్యాప్తు పూర్తి చేయాలని సుప్రీం కోర్టు నుంచి సిబిఐ కి ఆదేశాలు ఉండడంతో దర్యాప్తు విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గడంలేదు తెలంగాణ సిబిఐ. ఇక తాజాగా మరోసారి అవినాష్ రెడ్డి 16న విచారణకు హాజరు కావాలని సిబిఐ నోటీసులు ఇవ్వగా.. ఆరోజు వీలు పడదని ముందుగా నిర్ణయించుకున్న పార్టీ కార్యక్రమాల వల్ల తాను హాజరు కావడం కుదరదని సిబిఐకి అవినాష్ రెడ్డి లేఖ రాశారు. దాంతో విచారణను 19 వాయిదా వేస్తూ ఆ రోజు కచ్చితంగా హాజరు కావాలని ఏకంగా పులివెందులలో అవినాష్ రెడ్డి ఇంటికి వెళ్ళి నోటీసు ఇచ్చింది సిబిఐ.

Also Read: సచివాలయంలో తొలి కేబినెట్ భేటీ..

ఈ నేపథ్యంలో మరోసారి అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ కోసం తెలంగాణ హైకోర్టు ను ఆశ్రయించారు. అయితే వేసవి సెలవుల కారణంగా విచారణను హైకోర్టు హోల్డ్ లో పెట్టింది. దీంతో సుప్రీం కోర్టు ను ఆశ్రయించారు అవినాష్ రెడ్డి. అయితే గతంలో ముందస్తు బెయిల్ ఇచ్చే అవకాశం లేదని సుప్రీం కోర్టు తేల్చి చెప్పిన సంగతి విధితమే. దీంతో ఈసారి హైకోర్టు నిర్ణయమే ఫైనల్ కానుంది. కాగా అవినాష్ రెడ్డి 19న విచారణకు హాజరవుతారా లేదా అనేది ప్రశ్నార్థకమే. ఒకవేళ హాజరైతే సిబిఐ తరువాత ఎలాంటి చర్యలు తీసుకోనుంది అనేది కూడా ఆసక్తికరంగా మారింది. మొత్తానికి అవినాష్ రెడ్డి ఈసారి తప్పించుకోవడం కష్టమేనని, అరెస్ట్ కావడం పక్కా అంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో ఏం జరుగుతుందో చూడాలి.

Also Read: సిద్దరామయ్య వైపే మొగ్గు.. డీకేను దెబ్బతీసిందదే!

- Advertisement -