ఒక్కపూటే తిని బతికాడట

52
- Advertisement -

శివ బాలాజీ హీరో అవుదామని ఇండస్ట్రీకి వచ్చినా.. ఆశించిన స్థాయిలో సక్సెస్ ను మాత్రం అందుకోలేకపోయాడు. ఐతే, కొన్ని సినిమాల్లో సైడ్ క్యారెక్టర్స్ చేస్తూ వెళ్తున్నాడు. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో శివ బాలాజీ తన పర్సనల్ లైఫ్ కి సంబంధించి క్రేజీ కామెంట్స్ చేశాడు. ఇంతకీ, శివ బాలాజీ ఏం మాట్లాడాడు అంటే.. ‘నేను టీనేజ్ లోకి వచ్చేసరికి మా ఫాదర్ పెద్ద కంపెనీ రన్ చేస్తూ ఉండేవారు. చాలామంది మా ఫ్యాక్టరీలో పనిచేస్తూ ఉండేవారు. ఆ సంస్థకి సంబంధించిన వ్యవహారాలు నేను చూసుకోవాలని మా నాన్నగారికి కోరికగా ఉండేది. కానీ, శివ బాలాజీ అనే కుర్రాడికి సినిమాలు అంటే ఇష్టం. ఈ విషయాన్ని నాకు నేనే బాగా అర్థం చేసుకున్నాను.

‘అందుకే, వెంటనే నాకు సినిమాలంటే విపరీతమైన ఇష్టం అని, యాక్టింగ్ పట్ల ఎక్కువ ఆసక్తి ఉందని మా నాన్నగారికి చెప్పాను. ఆయన మొదట సీరియస్ గా తీసుకోలేదు. దాంతో, నేను చెన్నై నుంచి హైదరాబాద్ వచ్చేశాను. ఆ తర్వాత మా నాన్నకి ఫోన్ చేసి విషయం చెప్పాను. అయితే, ఇక అక్కడే ఉండు. ఇంటికి రాకు అని ఆయన కోపంగా ఫోన్ కట్ చేశారు. ఆ తర్వాత ఎన్ని ప్రయత్నాలు మొదలెట్టినా.. ఛాన్స్ లు రాలేదు. మరోవైపు నా దగ్గరున్న డబ్బులు అయిపోయాయి. అవకాశాలు మాత్రం రాలేదు.

Also Read:మిరియాలతో ఉప‌యోగాలు..

ఆ సమయంలో నేను చాలా కష్టాలు పడ్డాను. లేటుగా నిద్రలేచేవాడిని. కారణం భోజానికి డబ్బులు లేక. కేవలం ఒక పూట మాత్రమే భోజనం చేసేవాడిని. అలా నేను పడిన కష్టాలు చాలామందికి తెలియదు. చివరకు నా ప్రయత్నాలు ఫలించి ‘ఇది మా అశోక్ గాడి లవ్ స్టోరీ’లో ఛాన్స్ వచ్చింది. ఆ సినిమాకి పారితోషికంగా నాకు 40 వేలు ఇచ్చారు. అప్పటి నుంచి ఎలాగోలా కెరీర్ లో నిలబడ్డాను అని శివ బాలాజీ చెప్పుకొచ్చాడు.

- Advertisement -