తెలంగాణ రాష్ట్రాన్ని కోట్లాడి తెచ్చిన కేసిఆర్ కు ఆ రాష్ట్ర ప్రజలు 2014 మరియు 2018 ఎన్నికల్లో ఘనవిజయాన్ని ఇచ్చి ముఖ్యమంత్రి పదవిని కట్టబెట్టారు. గత పదేళ్ళ కాలంలో కేసిఆర్ సుపరిపాలన రాష్ట్రాన్ని అగ్రపథంలో నిలిపింది. అటు సంక్షేమంలోనూ ఇటు అభివృద్దిలోనూ ముఖ్యమంత్రి కేసిఆర్ చేపడుతున్న విధానాలు రాష్ట్ర ప్రజలు గర్వించేలా ఉన్నాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. దాంతో ముచ్చటగా మూడవసారి కూడా కేసిఆరే అధికారంలోకి రావాలని తెలంగాణ ప్రజానీకం గట్టిగా కోరుకుతోంది. ఇదే విషయాన్ని తాజాగా ఐటీ శాఖ మంత్రి కేటిఆర్ బెల్లంపల్లిలో నిర్వహించిన బహిరంగ సభలో చెప్పుకొచ్చారు. ప్రజా ఆశీర్వాదం వల్లే కేసిఆర్ రెండు సార్లు ముఖ్యమంత్రి అయ్యారని, మూడవసారి కూడా కేసిఆర్ ను గెలిపిద్దాం అంటూ కేటిఆర్ పిలుపునిచ్చారు.
Also Read: కర్ణాటక పోల్స్..ఎమ్మెల్సీ కవిత ఆసక్తికర ట్వీట్
కేసిఆర్ ను మూడవసారి ముఖ్య మంత్రిని చేయడమే మనందరి సమిష్టి లక్ష్యం అని చెప్పుకొచ్చారు కేటిఆర్. రాష్ట్రాన్ని నిర్మాణ పథంలో నడిపించే మన ప్రభుత్వానికి విధ్వంసమే ఎజెండాగా ఎంచుకున్న దుర్మార్గులకు జరుగుతున్నా పోరాటమని ఈ పోరాటంలో వారి కుట్రలను బలంగా తిప్పికొట్టాలని కేటిఆర్ కోరారు. మంచి నాయకత్వాన్ని ఎప్పటికీ చేజార్చుకోవద్దని కేసిఆర్ ను మూడవసారి కూడా సిఎం చేద్దామని కేటిఆర్ వ్యాఖ్యానించారు. కాగా ఈసారి కూడా తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీనే అధికారంలోకి రావడం ఖాయమని వివిధ రకాల సర్వేలు ఇప్పటికే వెల్లడించాయి. విశ్లేషకులు సైతం ఇదే విషయాన్ని చెబుతున్నారు. ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు చేసిన తెలంగాణలో బిఆర్ఎస్ గెలుపును ఆపడం సాధ్యం కాదనేది జగమెరిగిన సత్యం. కాగా గతంతో పోల్చితే ఈసారి బిఆర్ఎస్ కు సీట్ల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉందని విశ్లేషకుల అంచనా. మరి ఏం జరుగుతుందో చూడాలి.
Also Read: కేసిఆర్ ఎఫెక్ట్.. మహారాష్ట్రలో తెలంగాణ మోడల్ !