గవర్నర్ తమిళిసై సౌందరాజన్ వ్యవహార శైలిపై మంత్రి హరీశ్‌రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సచివాలయ ప్రారంభానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆహ్వానం అందలేదని గవర్నర్ చేసిన వ్యాఖ్యలపై ఆయన మీడియా మాట్లాడారు. ఈ సందర్భంగా పలు ఆంశాలను లెవనెత్తారు. సచివాలయ ప్రారంభానికి గవర్నర్‌ను పిలవాలని రాజ్యంగంలో ఉందా అని ప్రశ్నించారు.
వందేభారత్ రైలు ప్రారంభానికి ప్రధాని మోదీ… రాష్ట్రపతిని పిలిచారా అని ప్రశ్నించారు.రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలిగించేలా వ్యవహరించిన ఒక మహిళగా తమిళలిసైను గౌరవిస్తున్నామని అన్నారు. భద్రాచలం విలీన గ్రామాల బిల్లును పెండింగ్‌లో పెట్టారని ఎమ్మెల్యే పొడెం వీరయ్య వినతి పత్రం ఇచ్చారని అయిన కూడా బిల్లును ఆపారు…ఇంతకన్న అన్యాయం ఉంటుందా అని అన్నారు.
నేషనల్ మెడికల్ కౌన్సిల్ ప్రొపెసర్ల వయసును 70సంవత్సరాలకు పెంచవచ్చని గైడ్‌లైన్స్‌లోనే ఉంది. దానికి అనుగుణంగా మేము పదవి విరమణ వయసును పెంచడానికి సంబంధించిన బిల్లును గవర్నర్ ఆపారు. అనేక రాష్ట్రాల్లో 65 నుంచి 70 ఏండ్లకు పదవి విరమణ పెంచారని గుర్తు చేశారు. ఉమ్మడి జాబితాలో కొన్ని ఆంశాలు రాష్ట్రం జాబితాలో మరి కొన్ని అంశాలు ఉంటాయి..వాటికనుగుణంగా బిల్లులు ఉన్నాయా లేదా అని చూడటం వరకే అని గవర్నర్‌కు చురకలు అంటించారు.
ప్రజాప్రయోజనం కలిగిన బిల్లులు ఆపారని సుప్రీంకోర్టు వెళ్లేదాకా స్పందించలేదని మండిపడ్డారు. చివరికి తిరస్కరించి రాష్ట్రపతికి పంపారని అన్నారు. వైద్య బిల్లులను ఆపడం వల్ల రాష్ట్రప్రజలకు ఉపయోగపడే బిల్లులు ఆపడం ఎంతవరకు సరైన నిర్ణయం అని అన్నారు. నా ప్రభుత్వం అంటూనే గవర్నర్ వెన్నుపొటు పొడుస్తున్నారు.
పిల్లలకు విద్య నిరుద్యోగ యువతకు ఉద్యోగాలను గవర్నర్ దూరం చేస్తున్నారని మండిపడ్డారు. బీహార్ ఝార్ఖండ్ ఒడిశాలో యేండ్ల నుంచి యూనివర్సిటీ కామన్ రిక్రూట్ మెంట్ నడుస్తుంది. తెలంగాణలో మాత్రం బిల్లును ఆపారు. నోటితో నవ్వుతూ నొసలితో గవర్నర్ వెక్కిరిస్తున్నారని అన్నారు.
గతంలో 5 ప్రైవేట్ యూనివర్సిటీల బిల్లులు ఆమోదించిన గవర్నర్…ఇప్పుడు అలాంటి బిల్లులు వస్తే ఎందుకు ఆపుతున్నారో అర్థం కావడం లేదని అన్నారు. సిద్దిపేటకు వెటర్నరీ కాలేజీ మంజూరు అయ్యింది. అందులో ప్రొఫెసర్ల కొరత వల్ల విద్యా సంవత్సరం ముగుస్తుంది దానిని అడ్డుకోవడం రాష్ట్రప్రగతికి విఘాతం కాదా అని ప్రశ్నించారు.
జీ20సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం తెలంగాణ ఆత్మగౌరవం దెబ్బతీసేలా మాట్లాడారని గుర్తు చేశారు. కేసీఆర్ మాములు వ్యక్తా…రాజీనామా చేసిన ప్రతిసారి మెజార్టీ విజయంతో గెలిచిన వ్యక్తి గురించి ఆమె మాట్లాడిన మాటలు తెలంగాణ ప్రతిష్టను దెబ్బతీసేలా ఉందన్నారు. గవర్నర్ మీరైనా గెలిచారా అని ప్రశ్నించారు.
మా ఇంటికి మీ ఇల్లు ఎంత దూరమో మీ ఇంటికి మా ఇల్లు అంతే దూరం అనే సామెత గుర్తుపెట్టుకోవాలని చురకలు అంటించారు. కేసీఆర్ ప్రజల మనిషి. ఒక్క బటన్‌తో 8మెడికల్ కాలేజీలను స్థాపించారు. మోదీ ఒక ఏయిమ్స్ తెచ్చి డబ్బా కొట్టుకుంటున్నారు. ప్రధాని తన కార్యక్రమాలకు రాష్ట్రపతిని ఎందుకు పిలవడంలేదని ప్రశ్నించారు.
Also Read: Harishrao:దసరా నాటికే వరంగల్ హెల్త్ హబ్
రజనీకాంత్ తెలంగాణ గురించి గొప్పగా మాట్లాడితే…మీరేం అందుకు విరుద్దంగా మాట్లాడుతున్నారు. స్థానిక సంస్థలో అవిశ్వాసానికి నాలుగేళ్లు కనిష్ట పరిమితిని పెంచితే గవర్నర్‌కు ఉన్న ఇబ్బంది ఎంటని ప్రశ్నించారు. ఇలా మాట్లాడుకుంటూ పోతే చాలా అంశాలు ఉన్నాయని అన్నారు.
Also Read: BRS:కార్యాలయాన్ని ప్రారంభించిన సీఎం..

