గులాబీ సైనికుల పండుగ రోజు :కవిత

37
- Advertisement -

దేశ రాజధానిలో బీఆర్ఎస్ కార్యాలయం ప్రారంభోత్సవమంటే ప్రతి గులాబీ సైనికుడికి గర్వకారణమని ఎమ్మెల్సీ కవిత అన్నారు. సీఎం కేసీఆర్ దూరదృష్టి పట్టుదల నిబద్దత బీఆర్ఎస్ పార్టీని ఉన్నత స్థానానికి తీసుకెళ్లిందని అన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత ట్విటర్ ద్వారా స్పందిస్తూ… తెలంగాణ రాష్ట్ర లక్ష్య సాధనలో అనేక ఒడిదుడుకులు ఎదుర్కొని ప్రజామద్ధతుతో అనుకున్న లక్ష్యాన్ని సాధించామని అన్నారు. సీఎం కేసీఆర్ రాజనీతిజ్ఞతతో ఏర్పడిన తెలంగాణ ఈరోజు అభివృద్ధిలో దూసుకెళ్తున్నదని చెప్పారు. తొమ్మిది మంది లోక్‌సభ ఎంపీలు, ఏడుగురు రాజ్యసభ ఎంపీలు, 105 మంది ఎమ్మెల్యేలతో బీఆర్ఎస్ పార్టీ జాతీయస్థాయిలో కీలక పార్టీగా ఎదిగిందని ట్వీట్‌ చేశారు.

Also Read: BRS:కార్యాలయాన్ని ప్రారంభించిన సీఎం..

 

- Advertisement -