ప్రభాస్ ఆదిపురుష్ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌పై మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహన్ ప్రశంసలు కురిపించారు. టీజర్ విడుదలైనప్పుడు మిశ్రమ స్పందన వచ్చింది. దీంతో సినిమాలో గ్రాఫిక్స్‌ను మార్చే ప్రయత్నం చేస్తున్నారు. నిజానికి ఈ సినిమాను విడుదల చేయాల్సి ఉండగా గ్రాఫిక్స్ పేలవంగా ఉండటంతో దీనిని జూన్ 16న విడుదల చేయాడానికి మేకర్స్ ప్లాన్ చేసుకున్నారు. అయితే ఆదిపురుషు ట్రైలర్‌ను మే9న విడుదల చేయనున్నారని సమాచారం.
తాజాగా ఈసినిమా ట్రైలర్ చూసిన మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రశంసిస్తూ ట్వీట్ చేశారు. ఆదిపురుష్ ట్రైలర్ చూడడం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమా ప్రేక్షకులను కచ్చితంగా ఆకట్టుకుంటుంది. శ్రీరాముడి పాత్ర ప్రజలపై బలమైన ప్రభావం చూపుతుంది. ఈ సినిమాలోని పాత్రలకు నటీనటులు జీవం పోశారు అని తెలిపారు.
Also Read: ‘శ్రీలీల’ గ్లామర్ వెనుక సీక్రెట్స్ ఇవే !
ప్రభాస్ శ్రీరాముడిగా, జానకి పాత్రలో కృతి సనన్ కనిపించనుంది. రావాణాసురుడిగా సైఫ్ అలీఖాన్, లక్ష్మణుడిగా సన్నీ సింగ్, హనుమంతుడిగా దేవదత్త నాగే కనిపించనున్నారు.
Also Read: ఆ నటుడు ఆరోగ్యం మళ్లీ సీరియస్