మహేష్ ని మెప్పించలేకపోతున్నాడా?

35
- Advertisement -

త్రివిక్రమ్ మంచి మాటల రచయిత. పైగా మాటల రచయితకు స్టార్ డమ్ తెచ్చిన రచయిత కూడా. అందులో ఎలాంటి సందేహం లేదు. అన్నిటికీ మించి సంభాషణ రచయితల్లో మొట్టమొదటి సారి కోటి రూపాయలు రెమ్యూనిరేషన్ అందుకున్న రచయిత కూడా. అలాంటి త్రివిక్రమ్ తన మాటలతో మహేష్ బాబును ఒప్పించలేకపోతున్నారు. మెప్పించలేకపోతున్నారు. ఇండస్ట్రీలో ఇదే ఇప్పుడు ఇన్ సైడ్ టాక్. ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు – త్రివిక్రమ్’ కలయికలో సినిమా వస్తోంది.

ఇప్పటికే రెండు షెడ్యూల్స్ కూడా జరిగాయి. కానీ అవుట్ ఫుట్ పట్ల మహేష్ నిరాశ వ్యక్తం చేశాడు. దీంతో త్రివిక్రమ్ కూడా ఆ అవుట్ ఫుట్ ను పక్కన పెట్టేశాడు. మూడో షెడ్యూల్ కి స్క్రిప్ట్ లో చాలా మార్పులు చేసి షెడ్యూల్ ప్లాన్ చేశాడు. కానీ, ఈ మార్పులు కూడా మహేష్ కి నచ్చలేదు. నిజానికి త్రివిక్రమ్ దీనికి రెండు వెర్షన్లు వినిపించాడు. పైగా కాస్త ఎక్కువ టైమ్ తీసుకునే త్రివిక్రమ్ ఈ వెర్షన్ ఇచ్చాడు. అయినా మహేష్ కి నచ్చకపోవడమే విశేషమే. అందుకే సడెన్ గా ఈ సినిమా మూడో షెడ్యూల్ ను కూడా పోస్ట్ ఫోన్ చేసి.. మహేష్ దుబాయ్ వెళ్ళాడు.

Also Read: Meghana Raj:హ్యాపీ బర్త్ డే

మరి ఇప్పుడు త్రివిక్రమ్ తన వెర్షన్ కి మరో వెర్షన్ రాస్తాడా ? లేక, వేరే రచయితను పెట్టుకుంటాడా ?, రెండో ఆప్షన్ వైపు మహేష్ కూడా ఇంట్రెస్ట్ చూపించడు. సహజంగా త్రివిక్రమ్ గొప్ప రచయిత. కాబట్టి.. త్రివిక్రమ్ కి మహేష్ ఇంకో రైటర్ ను పెట్టుకోండి అని చెప్పడు. కానీ తనకు నచ్చేంత వరకూ మహేష్.. త్రివిక్రమ్ చేత స్క్రిప్ట్ రాయిస్తూనే ఉంటాడు. ఏమిటో రాను రాను టాలీవుడ్ లో పైకి చెప్పకున్నా, చెప్పుకోలేకున్నా త్రివిక్రమ్ ప్రభ తగ్గుతూ వస్తోంది.

Also Read: తమిళనటుడు మనోబాల ఇకలేరు..!

- Advertisement -