వేసవిలో కూల్ వాటర్ తాగడం సహజం. తీవ్రమైన ఎండల కారణంగా వేసవి తాపాన్ని తీర్చుకునేందుకు చల్లటి ద్రవాలను తాగడానికే ఎక్కువ మంది ఇష్టపడతారు. కొందరైతే సీజన్ తో సంబంధం లేకుండా చల్లటి నీటిని తాగడం ఒక అలవాటుగా మార్చుకొని ఉంటారు. నేటిరోజులో ఫ్రీడ్జ్ ప్రతిఒక్కరి ఇంట్లో ఉండడం కమాన్ అయిపోయింది. దాంతో కూల్ వాటర్ ను ఎక్కువగా తాగుతుంటారు. అయితే ఇలా ఎక్కువగా కూల్ వాటర్ తాగడం ఆరోగ్యానికి మంచిదేనా అంటే అస్సలు మంచిది కాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎక్కువగా కూల్ వాటర్ తాగడం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు పెరుగుతాయట. అందువల్ల అజీర్తి, వికారం, మలబద్దకం, ఉబ్బరం వంటి సమస్యలు తలెత్తుతాయి. .
సాధారణంగా మన శరీర ఉష్ణోగ్రత 37-38 డిగ్రీల సెల్సియస్ గా ఉంటుంది. అయితే భోజనం చేసేటప్పుడు కూల్ వాటర్ తాగడం వల్ల శరీర ఉష్ణోగ్రతలో ఒక్కసారిగా మార్పులు చోటు చేసుకుంటాయి ఫలితంగా జీర్ణ వ్యవస్థ మందగిస్తుంది. ఇక చల్లటి నీరు ఎక్కువగా తాగడం వల్ల గొంతు నొప్పి, తలనొప్పి, మైగ్రేన్ సమస్యలు కూడా తలెత్తే అవకాశం ఉందట. అయితే వీటన్నిటికి మించి కూల్ వాటర్ అధికంగా తాగితే పురుషుల్లో ప్రత్యుత్పత్తి వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతుందని పలు అద్యయానాలు చెబుతున్నాయి.
Also Read:టమాటాతో హార్ట్ ఎటాక్ దూరం !
పురుషులు కూల్ వాటర్ తాగడం వల్ల శుక్రకణాలు బలహీన పడి సంతన సామర్థ్యం తగ్గుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే కూల్ వాటర్ ఎక్కువగా తాగితే పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థకు రక్త ప్రసరణ సరిగా జరగకపోవడం వల్ల వీర్య కణాల నాణ్యతా తగ్గుతుంది. దీంతో అంగస్తంభన, వీర్య కణాల లోపం వంటి సమస్యలకు దారి తీస్తుంది. అందువల్ల పురుషులు వీలైనంత వరకు చల్లటి ద్రవలకు దూరంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు.
Also Read:కీళ్ళ నొప్పులు తగ్గడానికి చిట్కాలు..