తెలంగాణలో విస్తారంగ వానలు… ఆరెంజ్ అలర్ట్ జారీ

39
- Advertisement -

తెలంగాణ రానున్న నాలుగు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. నేడు రేపు వడగండ్లతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయిన పేర్కొంది. అయితే ఈరోజు ఉదయం హైదరాబాద్‌లో వర్షం పడింది. నగరంలోని పలు ప్రాంతాల్లో ఈదురుగాలులు ఉరుములతో కూడిన భారీవర్షం కురిసింది. దీంతో రోడ్లు లొతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఒక్కసారిగా కురిసిన జోరువానతో రోడ్లపైన నీరు నిలిచిపోయింది. దీంతో అప్రమత్తమైన జీహెచ్‌ఎంసీ యంత్రాంగం సహాయక చర్యలు చేపట్టింది.

దక్షిణ తూర్పు తెలంగాణ జిల్లాల్లో రేపు ఉత్తర పశ్చిమ మధ్య తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఉత్తర దక్షిణ ద్రోణి కింది స్థాయి నుంచి వీస్తున్న గాలులు ప్రభావంతో వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. పలు చోట్ల పిడుగులు వడగండ్లతో వాన పడుతుందని హెచ్చరికలు జారీ చేసింది.

Also Read: వేసవిలో పిల్లల కోసం ఈ జాగ్రత్తలు తప్పనిసరి !

40-50కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని కూడా తెలిపింది. మేడ్చల్‌, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, మహబూబాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, రంగారెడ్డి, వికారాబాద్‌, నాగర్‌కర్నూల్‌ జిల్లాలకు ఆరెంజ్‌ అలెర్ట్‌ జారీ చేసింది. దీంతో అత్యవసరమైతే తప్ప బయటకు రాకూడదని అధికారులు ప్రజలకు సూచించారు.

Also Read: ఎక్కిళ్ళు ఎక్కువైతే.. ఇలా చేయండి !

- Advertisement -