వేసవి కాలమంటే పెద్దలు ఇష్టపడటారో లేదో తెలియదు గాని పిల్లలకు మాత్రం వేసవి అంటే అమితమైన ఇష్టం. ఎందుకంటే చాలా మొత్తంలో సెలవులు రావడంతో వేసవి సెలవులను ఆస్వాదించడానికి పిల్లలు ఆసక్తి కనబరుస్తారు. తరచూ ఎండలో బయటకు వెళ్ళడం, సమయాభావం లేకుండా ఆటలు ఆడుకోవడం, వాగులో, బావుల్లో స్విమ్మింగ్ కు వెళ్ళడం.. అబ్బో ఇలా వేసవిలో పిల్లలు చేసే హడావిడి అంతా ఇంతా కాదు. అందువల్ల పిల్లల పట్ల తల్లిదండ్రులు సరైన జాగ్రత్తలు వహించకపోతే పిల్లలు అనారోగ్యం బారిన పడడం ఖాయం. కాబట్టి ఈ వేసవిలో పిల్లలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏవో తెలుసుకుందాం.
పిల్లలకు వేసవిలో చర్మ సమస్యలు రావడం సర్వసాధారణం. ఎందుకంటే ఎక్కువసేపు ఎండలో ఆడుకోవడం, ఫ్రెండ్స్ తో సరదాగా తిరగడం వంటివి చేస్తుంటారు చాలా మంది పిల్లలు దాంతో శరీరంపై చెమట పట్టి, దుమ్ము ధూళి పెరుకుపోయి దద్దుర్లు, చెమట కాయలు, వంటివి ఏర్పడతాయి. కాబట్టి పిల్లలు కచ్చితంగా సన్ స్క్రీన్ లోషన్స్ రాయడం ఎంతో మంచిది. ఇక వేసవిలో పిల్లలు తినే ఆహారంపై కూడా ఎంతో జాగ్రత్త వహించాలని నిపుణులు చెబుతున్నారు.
మాములుగానే పిల్లలు ఐస్ క్రీమ్, చాక్లెట్స్, కూల్ డ్రింక్స్ వంటివి ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. ఇక సమ్మర్ లో వాటిని మరింత ఎక్కువగా తింటూ ఉంటారు పిల్లలు. కాబట్టి శీతల పానియాల వల్ల పిల్లల ఆరోగ్యం పాడయ్యే అవకాశాలు ఉన్నాయి. అందువల్ల వాటి స్థానంలో మజ్జిగ, అంబలి, రాగి జావా వంటివి పిల్లలకు అలవాటు చేస్తే మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఇక పిల్లలకు వేసే దుస్తులపై కూడా తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ద వహించాలి. ఎక్కువ టైట్ గా ఉండే దుస్తులు గాని పాలిస్టర్ దుస్తులు గాని వేయడం వల్ల పిల్లలు అసౌకర్యానికి లోనయ్యే అవకాశం ఉంది. కాబట్టి కాటన్ దుస్తులు అవి కూడా పిల్లలకు ఎంతో వదులుగా ఉండేవి వేస్తే మంచిదని నిపుణులు చెబుతున్నారు.
Also Read: ఈ టిప్స్‌తో ఈజీగా బరువు తగ్గండి!
ఇక వేసవి వచ్చిందంటే పిల్లలు ఎక్కువగా స్విమ్మింగ్ ను ఇష్టపడుతూ ఉంటారు. కాబట్టి పిల్లలను ఒంటరిగా స్విమ్మింగ్ కు పంపించకుండా వారితో పాటు పేరెంట్స్ కూడా వెళితే మంచిది. అలాగే ఫ్రెష్ వాటర్ ఉన్న స్విమ్మింగ్ ఫూల్స్ లోనే పిల్లలు స్విమ్ చేసేలా చూసుకోవాలి. అప్పుడే చర్మ వ్యాధుల బారిన పడకుండా ఉంటారు. ఇక పిల్లలను బయటకు తీసుకెళ్లే సమయంలో వారి కళ్ళకు రక్షణగా కూలింగ్ గ్లాసెస్ మరియు ఎండ బారి నుంచి తప్పించేందుకు హెల్మెంట్ వంటికి పిల్లలకు తప్పనిసరిగా వాడాలి. కాబట్టి వేసవిలో పిల్లల పట్ల ఈ జాగ్రత్తలు తీసుకుంటే ఎంతో మంచిదని నిపుణుల సలహా.
Also Read: వీటితో..మీ ఆరోగ్యం పదిలం