Supreme Court:హెట్‌ స్పీచ్‌లపై కేసులు నమోదు..

29
- Advertisement -

దేశ అత్యున్నత కోర్టు రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇక నుంచి దేశంలో హెట్ స్పీచ్‌ను ఉపేక్షించబోమని ప్రకటించింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాలకు, కేంద్రప్రాలిత ప్రాంతాలకు ద్వేషపూరిత ప్రసంగాల మీద సూమోటోగా కేసు తీసుకోవాలని ఆదేశించింది. అయితే ఇది గతంలో ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, ఉత్తరఖండ్‌ రాష్ట్రాల పోలీసులకు మాత్రమే పరిమితమైన ఈ విషయాన్ని ఇక నుంచి అన్ని రాష్ట్రాలు పాటించాలని సూచించింది. అలాగే ఏ రాష్ట్రమైన పాటించికపోతే కోర్టు ధిక్కారంగా పరగణిస్తామని కూడా తెలిపింది.

దేశంలో ద్వేషపూరితమైన ప్రసంగాల విషయంలో గతంలో కేసులు తీసుకోవడంలో విఫలమైనందున్న మేము ఈ నిర్ణయం తీసుకుంటున్నామని తెలిపింది. ప్రసంగాన్ని రూపొందించిన వారి మతంతో సంబంధం లేకుండా అందరిపై చర్యలు తీసుకోవాలన్నారు. తద్వారా రాజ్యంగ పీఠికలో పేర్కొన్న భారత్ లౌకిక లక్షణాన్ని పరిరక్షించవచ్చని తెలుపుతూ మేము మరింత స్పష్టత ఇస్తున్నామని అని న్యాయమూర్తులు కెఎమ్ జోసెఫ్, బివి నాగరత్నతో కూడిన ధర్మాసనం ఈ రోజు తెలిపింది. దీన్ని తీవ్రమైన నేరంగా పేర్కొంటూ అత్యున్నత న్యాయస్థానం ద్వేషపూరిత ప్రసంగం వల్ల దేశంలోని లౌకిక స్వరూపాన్ని ప్రభావితం చేయగలదని కూడా పేర్కొంది.

దేశవ్యాప్తంగా ద్వేషపూరిత ప్రసంగాలపై కేసులు వివిధ కోర్టులో ఉన్నాయని తెలిపింది. ప్రతి రాష్ట్రానికి ఒక నోడల్ అధికారిని నియమించాలని పిటిషనర్లు పేర్కొనగా..ప్రతి జిల్లాకు ఒక బెంచ్‌ సూచించింది. సోషల్ మీడియా నుండి ద్వేషపూరిత ప్రసంగాలను ఉపసంహరించుకోవాడనికి ఒక విధానాన్ని రూపొందించాల్సిన అవసరం ఉందని పిటిషనర్లు పేర్కొన్నారు. కాగా కేంద్ర మంత్రి పై నమోదు చేయాల్సిన ఎఫ్‌ఐఆర్ గురించి జస్టిస్ కెఎం జోసెఫ్ మాట్లాడుతూ… ఎఫ్‌ఐఆర్‌కు అనుమతి అవసరమని మేజిస్ట్రేట్ మరియు హైకోర్టు దృవీకరించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు.

Also Read: కర్ణాటకలో మాటల వార్..!

దేశంలో ప్రజా ప్రయోజనాల కోసం మరియు రూల్‌ ఆఫ్ లా కోసం ఇటువంటి ద్వేషపూరిత ప్రసంగాలకు వ్యతిరేకంగా ఇక నుంచి కోర్టులు పిటిషన్లు స్వీకరిస్తోందని తెలిపారు. తదుపరి విచారణను మే 12 జరుపుతామని తెలిపింది.

Also Read: కాంగ్రెస్ ను జేడీఎస్ నమ్మట్లేదా ?

- Advertisement -