నేటి ఐపీఎల్ మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్ మరియు పంజాబ్ కింగ్స్ జట్లు తలపడనున్నాయి. పంజాబ్ లోని ఐఎస్ బింద్ర స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచ్ రాత్రి 7:30 నిముషాలకు ప్రారంభం కానుంది. ప్రస్తుతం ఈ రెండు జట్లు కూడా చెరో ఏడు మ్యాచ్ లు ఆడి అందులో చెరో నాలుగు విజయాలు సాధించి సమంగా ఉన్నాయి. దాంతో నేడు జరిగే మ్యాచ్ లో పై చేయి సాధించేందుకు ఇరు జట్లు కూడా గట్టిగా పోటీ పడనున్నాయి. గత మ్యాచ్ లో ముంబై పైచేయి సాధించిన పంజాబ్ ప్రస్తుతం జోరు మీద ఉంది. .
బ్యాటింగ్ లో ఆతర్వా థైడ్, సిమ్రాన్ సింగ్, సామ్ కరణ్ వంటి వాళ్ళు మంచి ఫామ్ లో కనిపిస్తున్నారు. ఇక బౌలింగ్ లో అర్షధీప్ సింగ్ పదునైన బౌలింగ్ తో ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తున్నాడు. ఇక లక్నో విషయానికొస్తే.. ఈ జట్టు ఎప్పుడు ఎలాంటి ప్రదర్శన ఇస్తోందో అర్థంకాని పరిస్థితి. మొదట మంచి దూకుడుగా కనిపించిన లక్నో.. ఆ తరువాత ఒక మ్యాచ్ గెలిస్తే మరో మ్యాచ్ ఓడిపోతూ వస్తోంది. గత మ్యాచ్ లో గుజరాత్ చేతిలో ఓటమి చవి చూసిన ఈ జట్టు ప్రస్తుతం పంజాబ్ పై విజయం కోసం ఉవ్విళ్లూరుతుంది. లక్నో బ్యాటింగ్ భారం అంతా కేఎల్ రాహుల్ పైనే ఉంది.. దీపక్ హుడా, శపర్డ్ వంటి వాళ్ళు కూడా రాణిస్తే.. ఆ జట్టుకు తిరుగుండదు. ఇక లక్నో బౌలింగ్ దళం అంచనాలకు తగ్గట్లుగా రాణించకపోవడం ఆ జట్టుకు మైనస్.
Also Read:మళ్లీ పెళ్లి నుంచి ఉరిమే కాలమా పాట
మరి ఈ ఆసక్తికరమైన మ్యాచ్ లో ఏ జట్టు విజయం సాధిస్తుందో చూడాలి. ఇక నిన్న జరిగిన రాజస్తాన్ రాయల్స్ మరియు చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ లో రాజస్తాన్ ఘనవిజయాన్ని సొంతం చేసుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ నిర్ణీత ఓవర్లలో 202 పరుగులు చేయగా.. లక్ష్య ఛేదనలో చెన్నై 170 పరుగులకే కుప్పకూరింది. ఈ విజయంతో రాజస్తాన్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలోకి దూసుకెళ్లగా.. చెన్నై వరుస విజయాలకు బ్రేక్ పడింది.
Also Read:పిక్ టాక్ : బోల్డ్ లుక్ తో మతులు పోగొట్టింది