KCR:దేశప్రజలు వాస్తవాలు గ్రహించాలి

44
- Advertisement -

మహారాష్ట్రలోని చంద్రాపూర్‌కు చెందిన పలువురు నేతలు తెలంగాణ సీఎం కేసీఆర్‌ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. తెలంగాణ భవన్‌లో వారందరికీ సీఎం కేసీఆర్ పార్టీ కండువాలు కప్పి అహ్వానించారు. అనంతరం కేసీఆర్ మాట్లాడుతూ…మహారాష్ట్ర నుంచి వచ్చిన నేతలు కార్యకర్తలకు సాదర స్వాగతం పలికారు. 75వ సంవత్సరాల దేశంలో ఎక్కడ సమస్య అక్కడ ఉండడానికి కారణం ఏంటని ప్రశ్నించారు. మనలో చైతన్యం రానంత వరకు మన జీవితంలో మార్పు రాదన్నారు. దేశంలో ఏం జరుగుతుందో మన కళ్లముందే కన్పిస్తుందన్నారు.

Also Read: KTR:రైతులకు అండగా ప్రభుత్వం

కరెంటు విషయంలో తెలంగాణ తప్ప దేశంలో ఏ రాష్ట్రం కూడా  నిరంతర విద్యుత్‌ సాధించలేదన్నారు. దేశంలో పుష్కలంగా నీరు ఉన్న…సంక్షోభం ఎందుకు వస్తుందన్నారు. దేశంలో 83కోట్ల ఎకరాల భూమిలో 41కోట్ల ఎకరాల భూమి సాగుయోగ్యమైందని అని అన్నారు. దేశంలో ప్రతి ఎకరానికి నీళ్లు ఇవ్వొచ్చు కానీ మన పాలకులు పట్టించుకోరు. ప్రతి ఎకరాకు ప్రతి ఇంటికీ నిళ్లు ఇవ్వాలన్నదే బీఆర్‌ఎస్ నినాదమని గుర్తు చేశారు. తెలంగాణలో ప్రతి ఇంటింటికీ సురక్షిత తాగునీరు అందిస్తున్నామని తెలిపారు.

Also Read: బీజేపీ తాటాకు చప్పుళ్ళు !

- Advertisement -