భోజనం చేసిన తరువాత స్వీట్స్ తింటే.. ఎమౌతుందో తెలుసా ?

94
- Advertisement -

సాధారణంగా చాలా మందికి రుచికరమైన భోజనం చేసిన తరువాత స్వీట్స్ తినే అలవాటు ఉంటుంది. ముఖ్యంగా వివాహ వేడుకల్లోనూ లేదా ఏదైనా ఫంక్షన్స్ లోనూ భోజనానికి ముందు లేదా భోజనం తరువాత స్వీట్స్ ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. దీంతో ఆటోమేటిక్ గా భోజనం తరువాత స్టీట్స్ తినాలనే ఆలోచన కలుగుతుంది. ఒకవేళ భోజనం చేసిన తరువాత స్టీట్స్ తినకపోతే ఏదో వెలితిగా ఉంటుంది. అయితే ఇలా భోజనం తరువాత స్వీట్స్ తినడం ఆరోగ్యానికి మంచిదేనా ? ఇంతకీ నిపుణులు ఏమంటున్నారు ? అరకమైన అలవాటు వల్ల లాభామా లేక నష్టమా అనే విషయాలను తెలుసుకుందాం !

నిజానికి భోజనం చేసిన తరువాత స్వీట్స్ తినడం అనేది మంచి అలవాటు కాదట. ఇలా చేయడం వల్ల పలు రకాల ఆరోగ్య సమస్యలు వేధిస్తాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా రక్తంలో చక్కెర స్థాయి అధికం అయ్యే అవకాశం ఉంది. దాంతో త్వరగా మధుమేహం బారిన పడే ఛాన్స్ ఉందట. ఇక స్వీట్స్ లో కొలెస్ట్రాల్ శాతం ఎక్కువ అందువల్ల భోజనం తరువాత స్వీట్స్ తింటే అధిక బరువుకు దారి తీస్తుంది. అదే ఊబకాయం సమస్యగా మారుతుంది. ఇక భోజనం తరువాత స్వీట్స్ తినడం వల్ల జీర్ణ సమస్యలు కూడా తలెత్తుతాయట. మనం తిన్న ఆహారాన్ని జీర్ణం చేయడానికి ఒక రకమైన రసాయనం జీర్ణాశయంలో ఉత్పన్నమౌతుంది.

Also Read: తాటిబెల్లం తింటే ఎన్ని ప్రయోజనలో..!

అయితే స్వీట్స్ తినడం వల్ల ఆ రసాయనం విడుదల మందగిస్తుంది. దాంతో అజీర్తికి దారి తీస్తుంది. నిజానికి తిన్న ఆహారం త్వరగా జీర్ణం అవ్వడానికి స్వీట్స్ తినాలని చాలా మంది చెబుతుంటారు అయితే అది ఒట్టి అపోహ మాత్రమే అని నిపుణులు చెబుతున్నారు. అంతే కాకుండా భోజనం తరువాత స్వీట్స్ తింటే గ్యాస్, అల్సర్, ఉబ్బరం వంటి సమస్యలు కూడా తలెత్తుతాయట. కాబట్టి భోజనం చేసిన వెంటనే స్వీట్స్ కు దూరంగా ఉండడమే మంచిదని నిపుణులు చెబుతున్నారు. స్వీట్స్ కు బదులుగా పండ్లను తినడం ఎంతో ఉత్తమం అని నిపుణుల సూచన.

Also Read: బరువు పెరగాలంటే.. ఈ చిట్కాలు పాటించాల్సిందే !

- Advertisement -