664అంతర్జాతీయ మ్యాచ్‌లు 34,357 అంతర్జాతీయ పరగులు 100 సెంచరీలు అనితర సాధ్యం కానీ రికార్డులు ఆయన సొంతం. అతన్నే క్రికెట్‌కు లిటిల్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ రమేష్ టెండూల్కర్. ఈ రోజు ఆయన 50వ వసంతంలోకి అడుగుపెట్టిన రోజు. అంతేకాదు ఈ 50 యేళ్ల కాలంలో సుదీర్ఘంగా 24సంవత్సరాల పాటు క్రికెట్‌ను ఆడి గెలిచిన వీరుడు. 1992 నుంచి 2011వరకు జరిగిన వరల్డ్ కప్ టోర్నీలకు ఆడిన ఏకైక ఆటగాడిగా రికార్డు. వన్డేలో మొదటి డబుల్ సెంచరీ సాధించిన ఆటగాడు.
వరల్డ్ కప్ టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా రికార్డు. బ్యాట్‌తోనే కాకుండా అవసరమైతే జట్టుకు బౌలింగ్‌తో కూడా ఆదుకున్న ఆటగాడు. ఇలా చెప్పుకుంటూ పోతే రికార్డులు ఎన్నోన్నో. బీసీసీఐ నుంచి మాజీ ఆటగాళ్ల వరకు విషెస్ తెలపడటమే కాకుండా అతడితో తమ అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. తాజాగా ఐసీసీ ఈ లెజెండరీ క్రికెటర్ కెరీర్‌లోని 10ఐకానిక్ మూమెంట్స్‌ను షేర్ చేసింది. వాటిలో 2011 వరల్డ్ కప్ ట్రోఫీతో సచిన్ ఉన్న ఫోటో మొదటి స్థానం దక్కింది. అన్నట్టు సచిన్‌కు అరుదైన గౌరవం దక్కింది. ఆస్ట్రేలియా క్రికెట్ గొప్ప బహుమతిని ప్రకటించింది. సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌లోని ఒక గేట్‌కు సచిన్ టెండూల్కర్ పేరు పెట్టింది. ఇలా అరుదైన గౌరవం అందుకున్న మొదటి వ్యక్తి సచిన్…వెస్టిండిస్ మాజీ ఆటగాడు లారా పేరును కూడా ఆగేటుకు పెట్టారు. అలాగే ముంబైలో వాంఖడే స్టేడియంలో కూడా సచిన్ నిలువెత్తు విగ్రహావిష్కరణ త్వరలో జరగనుంది.
మిగతా 9 ఇవే…
- పాకిస్థాన్ అంటే చాలు శివాలెత్తిపోయే సచిన్ 2011వరల్డ్ కప్ సెమీఫైనల్లో మరోసారి విశ్వరూపం చూపించాడు. దాయాదిపై 85 పరుగుల ఇన్నింగ్స్‌తో చెలరేగాడు.
- 2011 వరల్డ్ కప్‌లో లిటిల్ మాస్టర్ ఇంగ్లండ్‌పై సెంచరీ(120 పరుగులు) కొట్టాడు. దాంతో, వన్డేల్లో 47వ శతకం ఖాతాలో వేసుకున్నాడు.
- 2003 వరల్డ్ కప్‌లో పాకిస్థాన్‌పై 98 రన్స్ చేశాడు. విధ్వంసక బ్యాటింగ్‌తో 274 పరుగుల ఛేదనలో ఇండియాకు శుభారంభం ఇచ్చాడు.
- 2003 వరల్డ్ కప్‌లో ఇంగ్లండ్ బౌలర్ ఆండీ కాడిక్ ఓవర్‌లో సచిన్ భారీ సిక్స్ కొట్టాడు. మాస్టర్ బ్లాస్టర్ బాదిన ఆ బంతి స్టేడియం అవతల కారు పార్కింగ్ ప్లేస్‌లో పడింది.
- 1999 వలర్డ్ కప్‌లోకెన్యాపై శతకం(140) బాదాడు. తండ్రి చనిపోయిన బాధలో ఉన్న సచిన్ సెంచరీతో జట్టును ఆదుకున్నాడు.
- ఆస్ట్రేలియాపై 1998లో చాంపియన్స్ ట్రోఫీలో సచిన్ అదరగొట్టాడు. 141 రన్స్ కొట్టిన అతను 4/38 బౌలింగ్ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు.
- ఆసీస్‌పై 1996 వరల్డ్ కప్‌లో దంచికొట్టిన సచిన్ 96 పరుగులు చేశాడు. దాంతో 7 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన భారత్ 3 వికెట్ల నష్టానికి 143 రన్స్ చేయగలిగింది.
- పాకిస్థాన్‌తో తన తొలి మ్యాచ్( 1992 వరల్డ్ కప్)లో సచిన్ అర్థ శతకం (54 నాటౌట్) బాదాడు. ఈ మ్యాచ్‌లో ఇండియా 43 పరుగుల తేడాతో గెలిచింది.
- 1992 వరల్డ్ కప్‌లో న్యూజిలాండ్‌పై 84 పరుగుల ఇన్నింగ్స్‌తో సచిన్ రాణించాడు.