బాత్రుంలో కూడా వదల్లేదట..!

245
Crazy Fan Followed Actress Esha Gupta to a Washroom For Selfie ...
- Advertisement -

ఫ్యాన్స్‌ లేకుండా సినిస్టార్స్‌ లేరు అనేది పచ్చి నిజం. కాని అది హద్దుల్లో ఉన్నంతవరకే బాగుంటుంది. మితిమీరితే కొన్ని సార్లు అనర్థాలు కూడా జరుగుతాయి. హీరోల విషయంలో ఇది కొంత వరకు భరించగలిగినదే, కాని.. హీరోయిన్ లకు మాత్రం ఆ అవకాశం ఉండదు. ఎంత సర్దుకొనిపోదామన్నా కొందరు దురభిమానులు చేసే వికృత పనుల వల్ల వ్యక్తిగతంగా చాలా ఇబ్బంది పడుతుంటారు. అలాంటి అనుభవమే నటి ఈశా గుప్తాకు ఎదురైంది.
 Crazy Fan Followed Actress Esha Gupta to a Washroom For Selfie ...
దుబాయ్ లో ఓ ఫాషన్ ప్రోగ్రాం కి మోడల్ గా హాజరైన ఈశా గుప్తా వెనుక సెల్ఫీ కోసమంటూ ఫాలో అయ్యాడు. కొంత దూరం వరకు మాట్లాడుతూ వచ్చిన ఈశా తను వాష్ రూమ్ వెళ్ళాల్సి ఉండటంతో అతన్ని సున్నితంగా వెళ్ళమని చెప్పి పంపించే ప్రయత్నం చేసింది.

కాని అతను వినకుండా తన వెనకాలే వాష్ రూమ్ లోపలికి కూడా చొరబడటంతో ఈశా చాలా ఇబ్బందికి గురయ్యింది. సెక్యూరిటీని పిలిచి బయటికి పంపించే దాకా అతను వదలకపోవడం విశేషం. కాని తాను కేవలం సెల్ఫీ పిచ్చిలోనే చూసుకోకుండా వచ్చాను అని బ్రతిమాలాడుకోవడంతో కేసు లేకుండా పంపించారు.
 Crazy Fan Followed Actress Esha Gupta to a Washroom For Selfie ...
ఈ మధ్య సినిమా హీరొయిన్లకు సంబంధించిన భద్రత అనేది రాను రాను సమస్యగా మారుతోంది. ఆ మధ్య నటి భావనను గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్‌  చెయ్యడం, ఇంటర్వ్యూ లలో మాధవి లతా, అర్చన లాంటి మాజీ హీరొయిన్ లు సైతం తాము ఎంతటి ఇబ్బందులు పడుతున్నామో చెప్పడం, ఇలాంటి విషయాలన్నీ.. అందరిని ఆలోచింపజేసింది.

ఒక పక్క ఇండస్ట్రీ లో అవకాశాల కోసం పెద్ద వేధింపులు తట్టుకోవడం ఒక సమస్య అయితే మరో పక్క అభిమానుల వెకిలి చేష్టల వల్ల నరకాన్ని చూడాల్సి రావడం మరో సమస్య. ఎంత గ్లామర్, డబ్బు పేరు ఉన్నా మనశ్శాంతి దూరమవుతుంటే మాత్రం నటీమణులు ఎంతటి బాధను అనుభవిస్తున్నారో ఈశా గుప్తా ఉదంతం మరో సారి రుజువు చేసింది.

- Advertisement -