మండే ఎండకాలంలో కూడా దసరా చూపించావు అంటూ ఐకాన్ స్టార్ బన్నీ దసరా టీంపై ప్రశంసల వర్షం కురిపించారు. తాజాగా ఈ సినిమా చూసిన…తనకెంతో నచ్చిందన్నారు. ఈ సినిమా కోసం పనిచేసిన ప్రతి ఒక్కరినీ మెచ్చుకుంటూ ట్వీట్ చేశారు.
దసరా టీమ్ మొత్తానికి నా అభినందనలు…అద్భుతంగా చిత్రాన్ని తెరకెక్కించారు. అత్యుత్తమ ప్రదర్శనతో నాని కీర్తిసురేశ్ ఆకట్టుకున్నారు. ఈసినిమా కోసం సంతోష్నారాయణన్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్, సత్యన్ కెమెరా పనితనం బాగున్నాయన్నారు.
కెప్టెన్ ఆఫ్ ది షిప్ శ్రీకాంత్ ఓదెల తన పనితనంతో తొలి ప్రయత్నంలోనే అదరగొట్టేశారు. ప్రతి సీన్నూ ఆయన ఆద్భుతంగా తెరకెక్కించారు. సమ్మర్లో వచ్చిన నిజమైన దసరా ఇది అని బన్నీ ట్వీట్టర్లో పేర్కొన్నారు.
సింగరేణి నేపథ్యంలో దసరా సిద్ధమైంది. మార్చి 30న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి రికార్డు కలెక్షన్లు రాబట్టుకుంది. రూ. 65కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా విడుదలైన కొన్ని రోజుల్లోనే రూ.100కోట్ల వసూళ్లు రాబట్టినట్లు సినీ విశ్లేషకుల అంచనా.
ఇవి కూడా చదవండి…