వివేకా హత్య.. భాస్కర్ రెడ్డి అరెస్ట్!

44
- Advertisement -

ఏపీలో సంచలనం రేపిన వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు కీలక మలుపు తిరిగింది. గత కొన్నాళ్లుగా ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ ఇప్పటికే రెండు సార్లు ఈడీ విచారణ ఎదుర్కొన్నా వైఎస్ భాస్కర్ రెడ్డిని తాజాగా తెలంగాణ సీబీఐ అరెస్ట్ చేసింది. 2019 లో జరిగిన వివేకా హత్యలో భాస్కర్ రెడ్డి పాత్ర కీలకం అని పేర్కొన్న సీబీఐ పులివెందులలో ఆయన స్వగృహం నందే అరెస్ట్ చేసింది. ఆయనపై సెక్షన్ 120బి, రెడ్ విత్ 201, 302 ఐపీసీ సెక్షన్ల కింద అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. రాజకీయ ఆధిపత్యం కోసమే వివేకా హత్యను హత్య చేసేందుకు పూనుకున్నాట్లు సీబీఐ ఆధారాలు బయట పెట్టింది. ఇక భాస్కర్ రెడ్డి అరెస్ట్ తో ఒక్కసారిగా ఏపీ రాజకీయం వేడెక్కింది. .

గత కొన్నాళ్లుగా భస్కర్ రెడ్డి అరెస్ట్ ఖాయమని వార్తలు వస్తున్న నేపథ్యంలో తాజాగా అరెస్ట్ కావడం ఆసక్తికర పరిణామం. ఇక భాస్కర్ రెడ్డి తనయుడు వైఎస్ అవినాష్ రెడ్డి కూడా వివేకా హత్య కేసు లో విచారణ ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. నెక్స్ట్ అరెస్ట్ అవినాష్ రెడ్డి అనే వాదన వినిపిస్తోంది. ఇటీవల సీబీఐ విచారణ ఎదుర్కొన్న అవినాష్ రెడ్డి అనుచరుడు ఉదయ్ కుమార్ రెడ్డి విచారణలో ప్రదానంగా అవినాష్ రెడ్డి పేరు ప్రస్తావించినట్లు వినికిడి. వివేకా హత్య జరిగిన తరువాత మరియు జరుగక ముందు ఉదయ్ కుమార్ అవినాష్ రెడ్డి ఇంటికి వెళ్ళినట్లు రిమాండ్ లో తేలింది. దీంతో అతి త్వరలోనే అవినాష్ రెడ్డి కూడా అరెస్ట్ కావడం ఖాయం అనే వార్తలు వినిపిస్తున్నాయి.

అయితే ఒకవేళ అవినాష్ రెడ్డి అరెస్ట్ అయితే ఏపీ సి‌ఎం జగన్ కు తీవ్ర తలనొప్పిగా మారే అవకాశం ఉంది. ఎందుకంటే వైఎస్ జగన్ ఆదేశాలతోనే అవినాష్ రెడ్డి వివేకా హత్య కు పూనుకున్నట్లు పోలిటికల్ సర్కిల్స్ నుంచి వస్తున్న ప్రాథమిక సమాచారం. ప్రస్తుత పరిణామాల దృష్ట్యా అవినాష్ రెడ్డి అరెస్ట్ అయితే జగన్ పేరు ప్రస్తావిస్తారా ? ఒకవేళ ప్రస్తావిస్తే జగన్ ఏం చేయబోతున్నారు ? జగన్ కు కూడా సీబీఐ నోటీసులు తప్పవా ? అనే ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. ఏది ఏమైనప్పటికి ఈ నెల 30 లోగా వివేకా హత్య కేసును నిగ్గు తేల్చాలని సుప్రీం కోర్టు ఆదేశాలతో.. తెలంగాణ సీబీఐ వేగంగా ఈ కేసులో నిందితులను బయటపెడుతోంది. మరి సీబీఐ నెక్స్ట్ టార్గెట్ ఎవరో చూడాలి.

ఇవి కూడా చదవండి..

- Advertisement -