చాలా మందికి ఇష్టమైన మాంసహారాలలో సీ ఫుడ్ కూడా ఒకటి. షి ఫుడ్ లో రొయ్యలు, పీతలు ఇలా ఎన్నో రకాలు ఉన్నప్పటికి అందరికీ ఇష్టమైన షి ఫుడ్ చేపలు మాత్రమే. అయితే చేపలు తినడం వల్ల కలిగే ప్రయోజనల గురించి మాత్రం చాలమందికి తెలియదు. చేపలు తరచూ తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనలు కలుగుతాయియాని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. చేపలలో ప్రోటీన్ శాతం పుష్కలంగా ఉంటుంది. అందువల్ల కండరాలు పుష్టిగా తయారవుతాయి. ఇంకా చేపలలో కాల్షియం, ఫాస్ఫరస్, మెగ్నీషియం, ఐరన్ తో పాటు విటమిన్ డి వంటి పోషకాలు కూడా ఉంటాయి.
ఇవి మన శరీరానికి చాలా అవసరం. ఇక చేపలలో అన్నిటికి ముంచి ఒమేగా 3 ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. అందువల్ల గుండె జబ్బులు గణనీయంగా తగ్గుతాయని పలు అద్యయానాలు చెబుతున్నాయి. అంతే కాకుండా చేపలు తినడం వల్ల కిడ్నీ వ్యాధులు కూడా దూరం అవుతాయట. చేపల్లో ఉండే ఒమేగా 3 కారణంగా రక్త నాళాల్లో ఏర్పడే అడ్డంకులు తొలగిపోయి అన్నీ భాగాలకు రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. అలాగే పెద్ద పేగు, నోటి క్యాన్సర్, గొంతు క్యాన్సర్.. వంటి దీర్ఘకాలిక వ్యాధులు కూడా చేపలు తినడం వల్ల దూరం అవుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
Also Read:మృగశిర కార్తె ప్రారంభం..
ఇక స్త్రీలో సాధారణంగా వచ్చే ఋతు క్రమ సమస్యలు కూడా దూరం అవుతాయట. చేపలలో ఉండే విటమిన్లు, పోషకాలు, అమైనో యాసిడ్స్ అన్నీ కూడా మనం ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయని అద్యయానాలు చెబుతున్నాయి. ఇంకా చేపలు తినడం వల్ల కంటిచూపు మెరుగుపడడంతో పాటు నిద్రలేమి వంటి సమస్యలు కూడా దురమౌతాయి. డయబెటిస్ ఉన్న వాళ్ళు కూడా చేపలు తింటే మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఇవే కాకుండా చేపలు తింటే మానసిక ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్ వంటివి కూడా దూరం అవుతాయని చెబుతున్నారు నిపుణులు.
Also Read:NBK 108:భగవంత్ కేసరి ఫిక్స్