RinkuSingh:మట్టిలో మాణిక్యం మన రింకూ..!

81
- Advertisement -

ఐపీఎల్ ఒక వ్యక్తిని ఓవర్‌నైట్ స్టార్‌ను చేసింది. ఇది ప్రారంభించిన మొదటి నుంచి ఇప్పటివరకు భారత క్రికెట్‌కు ఎంతోమంది స్టార్స్‌ను తయారు చేసే ఫ్లాట్‌ఫామ్‌గా నిలిచింది. ఎంతోమంది క్రికెటర్ల నైపుణ్యాలను వెలికితీసి ఒడిసిపట్టేసుకుంది. ఇలా చెప్పుకుంటూ పోతే భారతమంతా ఉంటుంది. అలాంటి స్టార్ల మధ్య మరో స్టార్ వచ్చి చేరింది. మొన్నామధ్య కేకేఆర్‌తో గుజరాత్‌టైటాన్స్‌ తో జరిగిన మ్యాచ్‌లో చివరి ఓవర్‌లో వరుసగా ఐదు సిక్స్‌లు కొట్టి సంచలనమైన రికార్డు సృష్టించారు. అతడే మన స్టార్‌…రింకూ సింగ్‌.

1997అక్టోబర్‌ 12న ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్‌కు చెందిన ఖాన్‌ చంద్ర చిన్న కూమారుడు. పుట్టకతో రెండే గదులు ఉన్న ఇంట్లోనే పెరిగారు. ఖాన్‌చంద్ర ఓ ఎల్పీజీ సిలిండర్లను డోర్‌టూ డోర్ సప్లై చేసే ఆటో డ్రైవర్‌్. రింకూ అన్న కూడా ఆదే పనిచేస్తూ జీవనం సాగిస్తుంటారు. కానీ రింకూ మాత్రం ఆటతో పెరిగారు. ఆటతో జీవనం సాగిస్తున్నారు. 9వ తరగతి వరకు చదువుకున్న రింకూ..చదువుకు దూరంగా పనికి దగ్గరగా ఉన్నారు. స్వీపర్‌, క్లీనర్‌గా పనిచేశారు. రింకూ పెరిగే కొద్ది క్రికెట్‌పై మమకారం కూడా పెరిగింది. అతడు..ఒక్కో మెట్టు ఎక్కుతూ దేశవాళీ క్రికెట్‌లో ఆరంగేట్రం చేశారు. అయితే ఇతన్ని ఐపీఎల్ కూడా పిలిచింది. ఇటురా…నీ టాలెంట్ చూపించు అని పలకరించింది.

అయితే 2018లో మొదటి సారి ఐపీఎల్ వేలంలో రూ.80లక్షలకు కొనుగోలు చేసింది. కానీ ఆ సీజన్‌లో నాలుగు మ్యాచ్‌లే ఆడి..జట్టు దృష్టిలో నిరాశమిగిల్చాడు. కానీ 2019లో కూడా అదే తీరు కనిపించింది. ఇలా 2020,2021,2022లలో కూడా నిరాశ నిస్పృహల మధ్య సీజన్‌లు గడుస్తున్న ఆటలో మాత్రం ప్రతిభను ప్రదర్శించే సరైన సమయం కోసం వెతికాడు. కానీ దురదృష్టవశాత్తు 2023వేలంలో రింకూను కేకేఆర్ వదిలించుకోంది. కానీ చివరికి చేసేదేమిలేక మళ్లీ కేకేఆర్‌ రూ.55లక్షలకు కొనుగోలు చేసింది. అయితే ఈ సారి రింకూ అదృష్టాన్ని నమ్మలేదు ప్రతిభను నమ్మాడు. దీంతో ఓవర్‌నైట్‌ స్టార్‌గా ఎదిగాడు.

గుజరాత్‌ జెయింట్స్‌తో కేకేఆర్‌ అహ్మదాబాద్‌ వేదికగా గుజరాత్‌ జెయింట్స్‌తో కేకేఆర్ తలపడ్డది. అయితే ఈ మ్యాచ్‌లో ఆశలు వదులుకున్న కేకేఆర్ జట్టు చివరి ఓవర్‌ రూపంలో రింకూ కనబడ్డాడు. జోషువా లిటీల్ వేసిన 19వ ఓవర్లో ఆఖరి రెండు బంతుల్లో 6,4కొట్టి జట్టు విజయా అవకాశాలను గుర్తు చేశారు. అయితే 20వ ఓవర్‌ వేసిన యశ్‌ దయాల్‌ బోల్తా పడ్డారు. బౌలింగ్‌లో మెరుగైన ప్రదర్శన ఇవ్వలేకపోయారు. కానీ రింకూ మాత్రం దీన్ని సద్వినియోగం చేసుకోని వరుసగా ఐదు సిక్స్‌లు కొట్టి కేకేఆర్‌కు సంచలన విజయాన్ని అందించారు. దీంతో ఒక్కసారిగా రింకూ సింగ్‌ ఓవర్‌నైట్‌ స్టార్‌గా ఎదిగాడు. దాని వెనుక అహోరాత్రులు నిద్రలేని రాత్రులు గడిపిన క్షణాలు ఒక్కసారిగా కనిపిస్తాయి. పస్తులు ఉండి నీళ్లు తాగి ఆటతో దాహాన్ని తీర్చుకున్న మన రింకూసింగ్‌.

ఇవి కూడా చదవండి…

IPL 2023:కింగ్స్ vs రాయల్స్.. తగ్గేదెలే!

IPL 2023:ఎట్టకేలకు బోణి కొట్టిన ముంబై

మస్క్‌ వర్సెస్ వెస్ట్రన్ కంట్రీస్‌..!

- Advertisement -