ఛాలెంజ్ చేశా.. నో రెస్పాన్స్ !

49
- Advertisement -

తెలంగాణ లో ముఖ్యమంత్రి కే‌సి‌ఆర్ చేస్తున్న సుపరిపాలన ఎలాంటిదో ప్రత్యేకించి చెప్పవలసిన అవసరం లేదు. అన్నీ రంగాల్లోనూ తెలంగాణ అగ్రగామి గా దూసుకుపోతోంది. వ్యవసాయ రంగం, విద్యారంగం, పారిశ్రామిక రంగం.. ఇలా అన్నీ రంగాల్లోనూ తెలంగాణ సాధిస్తున్న విజయాలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయి. అయితే తెలంగాణ సాధిస్తున్న అభివృద్ది కేంద్ర ప్రభుత్వానికి ఏ మాత్రం మింగుడు పడడం లేదు. బిజెపి పాలిత రాష్ట్రాల్లో జరగని అభివృద్ది తెలంగాణలో జరుగుతుండడం.. దేశ ప్రజలు కూడా తెలంగాణ మోడల్ ను కోరుకుంటూ ఉండడంతో.. బీజేపీ అధిష్టానానికి కంటిమీద కునుకు లేకుండా పోయింది.

దాంతో ఎలాగైనా కే‌సి‌ఆర్ పాలనపై బురద చల్లే కార్యక్రమానికి తెరతీసింది మోడి సర్కార్. ఇటీవల 7 వ తేదీన తెలంగాణకు వచ్చిన ప్రధాని మోడి, తెలంగాణలో అభివృద్ది కొరవడిందని, కేంద్ర చేసే అభివృద్దిని రాష్ట్ర ప్రభుత్వ అడ్డుకుంటుందని కే‌సి‌ఆర్ సర్కార్ పై విమర్శలు గుప్పించారు. అయితే ప్రధాని మోడి చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ ఐటీ శాఖ మంత్రి.. ఆధారాలతో మోడికి సవాల్ విసిరారు. దేశంలో ఎక్కువ తలసరి ఆదాయం కలిగిన రాష్ట్రం తెలంగాననే అని, దేశం మొత్తం మీద ప్రతి ఇంటికి మంచినీటి సౌకర్యం ఉన్న ఏకైక రాష్ట్రం తెలంగాణనే అని, దేశంలో ఎక్కువ వరి పండించే రాష్ట్రాల జాబితాలో తెలంగాణ రెండవ ప్లేస్ లో ఉందని.. ఇలా అన్నీ రంగాలకు సంబంధించి తెలంగాణ సాధించిన అభివృద్దిని కే‌సి‌ఆర్ ట్వీట్ చేశారు.

అంతే కాకుండా ఈ 9 ఏళ్ల కాలంలో మోడి పాలనలో ఏ రాష్ట్రం ఎంతమేర అభివృద్ది సాధించిందో వివరించగలరా అంటూ బీజేపీ నేతలకు సవాల్ విసిరారు కే‌టి‌ఆర్.. అయితే ఈ సవాల్ పై బీజేపీ నేతల నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. దాంతో ” నేను సవాల్ విసిరా.. అటువైపు నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాలేదు.. దీన్ని బట్టి దేశంలో ఎంతటి అసమర్థ పాలన సాగుతుందో అర్థం చేసుకోవచ్చు.” అంటూ కే‌టి‌ఆర్ ట్వీట్ చేశారు. ప్రస్తుతం కే‌టి‌ఆర్ చేసిన ట్వీట్ సామాజిక మద్యమాల్లో వైరల్ అవుతోంది.

ఇవి కూడా చదవండి…

KTR:చీమలపాడులో అపశృతి..కేటీఆర్ దిగ్బ్రాంతి.!

KTR:అదానీకి విశాఖ ఉక్కు…తెలుగు ప్రజలకు భారీ నష్టం..!

Kaleshwaram:మండుటెండల్లోనూ జల కళ..

- Advertisement -