KTR:చీమలపాడులో అపశృతి..కేటీఆర్ దిగ్బ్రాంతి.!

53
- Advertisement -

బీఆర్ఎస్ పార్టీ నిర్వహిస్తున్న బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మెళనంలో అపశృతి చోటుచేసుకుంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని వైరా నియోజకవర్గంలోని కారేపల్లి మండలం చీమలపాడు వద్ద జరిగిన అగ్నిప్రమాద ఘటనపై బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ నేతలతో అధికారులతో కేటీఆర్ మాట్లాడారు. మృతుడి కుటుంబం క్షతగాత్రులను ఆదుకుంటామని హామీనిచ్చారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని కేటీఆర్ ఆదేశించారు.

బీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వర్‌రావు, వైరా ఎమ్మెల్యేతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. అయితే నేతలను ఆహ్వానిస్తూ కార్యకర్తలు బాణాసంచా పేల్చారు. దీంతో ఆనిప్పురవ్వలు ఎగిరిపడి సభా ప్రాంగణానికి 200మీటర్ల దూరంలో ఉన్న గుడిసెపై పడి సిలీండర్‌ పేలింది. దీంతో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుల్లో ఒకరు మృతి చెందారు. పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.

ఇవి కూడా చదవండి…

కాంగ్రెస్ నేత జానారెడ్డికి స్వల్ప అస్వస్థత

Kaleshwaram:మండుటెండల్లోనూ జల కళ..

KTR:అదానీకి విశాఖ ఉక్కు…తెలుగు ప్రజలకు భారీ నష్టం..!

- Advertisement -