తెలంగాణలో అధికార బిఆర్ఎస్ పార్టీని కూల్చేందుకు ఎన్నో కుతంత్రలు చేస్తున్న బీజేపీ.. ఎప్పటికప్పుడు చేతులు కాల్చుకుంటూనే ఉంది. ఆ మద్య బిఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నించి అపహశుపాలైంది. ఇక డిల్లీ లిక్కర్ స్కామ్ ను ఆధారాలు లేకుండా ఎమ్మెల్సీ కవితాపై నెట్టే ప్రయత్నం చేస్తోంది. ఇలా చెప్పుకుంటూ పోతే కేసిఆర్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కమలనాథులు చేస్తున్న ప్రయత్నాలు అన్నీ ఇన్ని కావు. బిఆర్ఎస్ లోని కొందరి నేతలకు గాలం వేసి ఆ నేతల ద్వారా పార్టీ ప్రతిష్టను దెబ్బతీసే వ్యూహానికి పూనుకుంది బీజేపీ. దీనికి బెస్ట్ ఉదాహరణ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణరావు ల యొక్క వ్యవహారమే.
గత కొంత కాలంగా ఈ ఇద్దరు పార్టీపై వ్యతిరేక స్వరం వినిపిస్తున్నాయి. అలాగే తెలంగాణ సిఎం కేసిఆర్ పై తరచూ విమర్శలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. అయితే వీరిద్దరు ఎందుకు వ్యతిరేక స్వరం వినిపిస్తున్నారనే దానిపై పోలిటికల్ సర్కిల్స్ లో పలు రకాల వాదనలు నడుస్తున్నాయి. వీరిద్దరికి బీజేపీ నుంచి ముడుపులు ముట్టాయని, అందుకే తరచూ కేసిఆర్ పై బురద చాల్లే ప్రయత్నం చేస్తున్నారనేది కొందరి అభిప్రాయం. గత కొన్నాళ్ళువగా ఈ ఇద్దరి వ్యవహార శైలి కూడా అలాగే ఉంది. కాగా వీరిద్దరూ తీరులో మార్పు కోసం ఎదురు చూసిన బిఆర్ఎస్ అధిష్టానం.. ఎంతకీ మార్పు రాకపోవడంతో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణరావు పై సస్పెన్షన్ వేటు వేసింది. ఇప్పుడు వీరిద్దరు ఏ పార్టీలో చేరతారనేది కూడా ఆసక్తికరమే. అయితే పోలిటికల్ సర్కిల్స్ నుంచి వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఈ ఇద్దరు కూడా పక్కాగా బీజేపీ గూటికే చేరే అవకాశం ఉందట. పక్కా ప్రణాళిక బద్దంగానే బిఆర్ఎస్ లో ఉంటూ బీజేపీ పక్షాన నిలిచారనేది కొందరి విశ్లేషకుల నుంచి వినిపిస్తున్న మాట. ఎట్టకేలకు బీజేపీ డైరెక్షన్ లో నడిచే ఆ ఇద్దరిని బిఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేయడం మంచిదే అని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి…