IPL 2023:బోణి కొట్టిన సన్‌రైజర్స్‌

19
- Advertisement -

ఎట్టకేలకు ఐపీఎల్ 2023 సీజన్‌లో బోణి కొట్టింది సన్ రైజర్స్ హైదరాబాద్. పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. పంజాబ్ విధించిన 144 పరుగుల టార్గెట్‌ని 17.1 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కొల్పోయి 145 పరుగులు చేసింది. రాహుల్ త్రిపాఠీ హాఫ్ సెంచరీతో 48 బంతుల్లో 74 పరుగులతో నాటౌట్ గా నిలవగా మార్ క్రమ్ 21 బంతుల్లో 37 పరుగులతో రాణించాడు.

ఇక అంతకముందు తొలుత టాస్ గెలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్ మొదట బౌలింగ్ చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన పంజాబ్ టాప్ ఆర్డర్ పేక మేడలా కుప్పకూలింది. ఒక్కొక్కరుగా పెవిలియన్ బాట పడుతున్న శిఖర్ ధావన్ ఒక్కడే రాణించాడు. పంజాబ్ 143 పరుగులు చేస్తే అందులో ధావన్ చేసినవే 99 పరుగులు. వికెట్లు పడుతున్న ఏ మాత్రం బెదరకుండా జోరును చూపించాడు ధావన్.

ఇవి కూడా చదవండి..

- Advertisement -