నిరాశ నిస్పృహలో క్రేజీ బ్యూటీ ?

61
- Advertisement -

కృతి శెట్టి అనగానే తెలుగు వాళ్లకు గుర్తొచ్చే సినిమా… ఉప్పెన. ఈ సినిమాలో బేబమ్మ గా కృతి అదరగొట్టింది. ఈ అందాల భామ తెలుగులో మరింతగా బిజీ అయ్యింది. అయితే, ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేక పోయింది. తమిళంలోనూ ఆఫర్లు ఉన్నాయి. కాబట్టి కెరియర్ పరంగా ఆమెకి ఢోకా లేదు. బాగానే సంపాదిస్తోంది. ఐతే, తాజాగా కృతి శెట్టి తన సన్నిహితుల దగ్గర చెబుతున్న మాటలకు ఆమె సన్నిహతులు కంగారు పడ్డారట.

కృతి శెట్టి మాటలను బట్టి ఆమె డిప్రెషన్ లో ఉందని అంటున్నారు. గతంలో దీపిక పదుకోన్ వంటి పేరొందిన హీరోయిన్లు కూడా ఇటీవల తాము డిప్రెషన్ తో బాధపడినట్లు చెప్పారు. సక్సెస్ ఉన్నవారు కూడా ఎందుకో డిప్రెషన్ కి గురవుతున్నారు అనేదే ఇక్కడ మెయిన్ పాయింట్. కృతి శెట్టి ఏమీ చిన్నాచితక నటి ఏమీ కాదు. ఏడాదికి నాలుగు కోట్లు సంపాదిస్తున్న హీరోయిన్. పైగా వయసు కూడా చాలా తక్కువ. మరీ ఇక కృతి శెట్టికి డిప్రెషన్ ఎందుకు ?,

అయినా, ఈ డిప్రెషన్ వార్తలు ఎక్కువ అయితే, కృతి శెట్టికి వచ్చే అవకాశాలు కూడా పోతాయి. అందుకే, కృతి శెట్టి తల్లి కోలీవుడ్ మీడియాకి వివరణ ఇచ్చింది. “కృతి శెట్టి బాగుంది. ఎటువంటి మానసిక సమస్యలు కృతి శెట్టికి లేవు. కొన్ని కొన్ని సార్లు మన ఎమోషన్స్ ని, మన ఫీలింగ్స్ ని ఇతరులతో షేర్ చేసుకోవాలి. బయటపెట్టుకోవాలి. అప్పుడే మనసు తేలిక అవుతుంది. ఈ క్రమంలోనే కృతి శెట్టి తనకు వచ్చిన చిన్న ఇబ్బందులను బయట పెట్టింది. వాటిని పెద్దవి చేసి చెబుతున్నారు అంతే’ అంటూ కృతి శెట్టి తల్లి చెప్పుకొచ్చింది.

ఇవి కూడా చదవండి…

ఆ హాస్యనటి మనసులో మాటలు

SAMANTHA:చైతు ఎఫైర్ పై సమంత స్పందన

Ugram:మే5న ఉగ్రం విడుదల

- Advertisement -